జీవిత యుద్ధంలో గెలవడానికి దైర్యానికి మించిన ఆయుధం లేదు
- భగత్ సింగ్
తిరుమల యాత్రగైడ్
దర్శనం ప్రసాదం
మొక్కులు విరాళాలు
బస భోజన సౌకర్యం
ప్రయాణం దర్శనీయ స్థలాలు
ధర్మ ప్రచార ప్రాజెక్టుల సమాచారం
సందేహాలు సమాధానాలు
టీటీడీ న్యూస్.కామ్
ఆధ్యాత్మిక జ్ఞానధార
టీటీడీ చరిత్ర
నోటీసు బోర్డ్
ఎస్వీభక్తి చానల్ లో నేడు
టీటీడీలో ముఖ్యమైన ఫోన్ నెంబర్లు
నిత్య సూక్తి సంపద
పాలకమండలి నిర్ణయాలు
ఇక ప్రజాప్రతినిధులకు తిరుమలలో రాచమర్యాదలు
శాసనసభ, తిరుమలలో కార్యాలయాలు రామాలయాల నిర్మాణానికి సాయం పెంపు తితిదే పాలకమండలి తీర్మానాలు
తిరుమల , జనవరి 28:
వైకుంఠ ఏకాదశి సందర్భంగా తమకు జరిగిన అవమానంపై ప్రజాప్రతినిధులు ఇచ్చిన హక్కుల నోటీసులకు టీటీడీ బెంబేలెత్తింది. ఇకపై వారికి రాచ మర్యాదలు చేయాలని నిర్ణయించింది. ఇందుకోసం అసెంబ్లీ ఆవరణలోనే వారి సిఫారసు ఉత్తరాలు తీసుకోవడానికి ఒక కౌంటర్ తెరవాలనే నిర్ణయానికి వచ్చింది. పదవీ విరమణ చేసిన ఐఏఎస్ అధికారి కేవీ.రమణాచారిని పాలకమండలి సలహాదారుగా నియమించింది. మార్కెట్‌లో ధరల హెచ్చుతగ్గులతో నిమిత్తం లేకుండా శ్రీవేంకటేశ్వర స్వామి బంగారు నాణేలను ఒకే ధరకు విక్రయించాలని తీర్మానించింది.
తిరుమల అన్నమయ్య భవన్‌లో శుక్రవారం చైర్మన్ కనుమూరి బాపిరాజు అధ్యక్షతన టీటీడీ పాలక మండలి సమావేశమైంది. వైకుంఠ ఏకాదశి రోజున ఎమ్మెల్యేలు స్వయంగా వచ్చినా వారికి తగిన గౌరవం ఇవ్వకుండా ప్రోటోకాల్‌లోని వారిని ప్రాధాన్యత దర్శనానికి అనుమతించింది. దీనిపై పలువురు ఎమ్మెల్యే లు స్పీకర్ ద్వారా హక్కుల నోటీసులు జారీ చేయిం చారు. పాలక మండలి సభ్యులుగా ఉన్న ఎమ్మెల్యేలు ముత్యంరెడ్డి, రౌతు సూర్యప్రకాశరావు ఈ వ్యవహారం పై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఈ నేపథ్యంలో ఇకపై స్వయంగా దర్శనానికి వచ్చే ఎమ్మెల్యేలు, మర్యాదలు చేసి, మంచి దర్శన సదుపాయం కల్పించాలని టీటీడీ నిర్ణయించింది. ఇందుకోసం అసెంబ్లీ ఆవరణలో ఒకటి, తిరుమలలో మరో కౌంటర్ ఏర్పాటు చేయాలని తీర్మానించింది.
సాయంత్రం బ్రేక్ దర్శనం కోసం మధ్యాహ్నం 3 గంటల వరకు, ఉదయం బ్రేక్ దర్శనం కోసం రాత్రి 8 గంటల వరకు ఎమ్మెల్యేల లేఖలను తీసుకునే ఏర్పాటు చేయనుంది. ఎమ్మెల్యేల ద్వారా సిఫారసు ఉత్తరాలు తెచ్చే వారికి కూడా అందుబాటులో ఉన్న దర్శనం కల్పించాలని నిర్ణయించింది. ఒక వేళ అలా ఏర్పాటు చేయలేక పోతే కారణాలను ఆ ఎమ్మెల్యేకు వెంటనే తెలియచేసే వ్యవస్థను అందుబాటులోకి తీసుకురావాలని తీర్మానించింది. అసెంబ్లీ ప్రాంగణం, తిరుమలలో వచ్చే నెల 10వ తేదీ ఇందుకోసం ప్రత్యేక విభాగాలను ప్రారంభించాలని నిర్ణయించింది. బ్రేక్ దర్శనాల విషయంలో ఇప్పటి దాకా అమలులో ఉన్న ప్రాధాన్యత, అప్రాధాన్యత కోటాలను రద్దు చేయాలని తీర్మానించింది. దళితవాడల్లో రామాలయాలు నిర్మించడం కోసం ఇప్పటివరకు ఇస్తున్న రూ.5 లక్షల సహాయాన్ని రూ.10 లక్షలకు పెంచింది. ఉదయాస్తమాన సేవ భక్తుల సౌలభ్యం దృష్ట్యా వారు టికెట్ కొనేప్పుడు 12 మంది పేర్లు ఇస్తే, సేవకు హాజరయ్యే రోజు అందులో ఆరుగురిని వెంట తీసుకుని వచ్చే పద్ధతి ప్రవేశ పెట్టాలని నిర్ణయించింది.
ఇంటర్ విద్యార్థులకు పుస్తక ప్రసాదం కింద పాఠ్యపుస్తకాలను ఉచితంగా అందించే పథకం వల్ల ఉపయోగం ఉందా ? అనే విషయాన్ని వచ్చే సమావేశంలో క్షుణ్ణంగా చర్చించి, తదుపరి నిర్ణయం తీసుకోవాలని తీర్మానించింది. పాడుబడిన ఆలయాల జీర్ణోద్ధరణకు కూడా ఆర్థిక సహాయం అందించాలని నిర్ణయం తీసుకుంది. వైఎస్సార్ జిల్లా గండి క్షేత్రంలో తమ ఆధీనంలో ఉన్న శ్రీ వీరాంజనేయ స్వామి దేవస్థానాన్ని తిరిగి దేవాదాయశాఖకు అప్పగించేందుకు సూత్రప్రాయంగా నిర్ణయం తీసుకుంది. సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి ఆదేశం మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. ఏటా రూ.300 కోట్లకు పైగా ఖర్చు చేసి, సరుకులు కొనుగోలు చేస్తున్న మార్కెటింగ్ విభాగాన్ని పూర్తిస్థాయిలో ప్రక్షాళన చేయాలని సమావేశం తీర్మానించింది. ఇకపై అత్యవసరం పేరుతో హడావుడిగా సరుకులు కొనుగోలు చేయరాదని సంబంధిత అధికారులను ఆదేశించింది.
బియ్యం నాణ్యతపై ఇటీవల పెద్ద ఎత్తున దుమారం రేగిన నేపథ్యంలో పాలక మండలి ఈ నిర్ణయం తీసుకుంది. రంగారెడ్డి జిల్లాలో శ్రీసేవ ఫౌండేషన్ నిర్వహణలో 400 గోవులతో నిర్వహిస్తున్న గోసంరక్షణ శాలను టీటీడీ నిర్వహణలోకి తీసుకోవాలని తీర్మానించింది. ప్రతి జిల్లాలో సుమారు 100 ఎకరాల భూమిని దాతలు ఇస్తేనే గోసంరక్షణ శాల ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. రెండేళ్ల కిందట రద్దు చేసిన అర్చనానంతర దర్శనం(ఏఏడీ) తిరిగి ప్రారంభించే దిశగా ఆలోచన చేసిన పాలకమండలి వచ్చే నెల 10వ తేదీ జరిగే ప్రత్యేక సమావేశంలో నిర్ణయం తీసుకోవాలని భావించింది. దేవాదాయశాఖ ముఖ్య కార్యదర్శి చిత్రా రామచంద్రన్, ఆ శాఖ కమిషనర్ బలరామయ్య, ఈవో ఎల్వీ సుబ్రమణ్యం, సభ్యులు చెరకు ముత్యంరెడ్డి, రౌతు సూర్యప్రకాశరావు, రాజేశ్వరి సమావేశంలో పాల్గొన్నారు.
శుక్రవారం జరిగిన పాలకమండలిలో ఇంకా కొన్నింటిపై నిర్ణయాలు , పలు విషయాలపై చర్చ
- తిరుమల-తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో కళాశాలల్లో పనిచేస్తున్న 190 మంది కాంట్రాక్టు అధ్యాపకులకు శుభవార్త. ఇంత కాలం నెలకు రూ 8 వేలతో పనిచేస్తున్న వారికి వెంటనే రూ 20,700 వేతనం చెల్లించాలని టీటీడీ పాలక మండలి తీర్మానించింది. తిరుమల అన్నమయ్య భవన్‌లో శుక్రవారం చైర్మన్ బాపిరాజు అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఈ అంశంపై సుదీర్ఘంగా చర్చించారు. సభ్యులు చెరకు ముత్యంరెడ్డి, రౌతు సూర్యప్రకాశరావు ఈ అంశాన్ని చర్చకు తెచ్చి వారికి కనీస వేతనం చెల్లించాలని పట్టుబట్టారు. దీంతో పాలక మండలి సమావేశంలో ఈ అంశంపై సుదీర్ఘ చర్చ జరిగింది. కాంట్రాక్టు అధ్యాపకులకు న్యాయం చేయాలనే విషయంలో పాలక మండలి మొత్తం ఏకాభిప్రాయం వ్యక్తం చేసింది. కొన్ని దశాబ్దాల తర్వాత వారు కనీస వేతనం అందుకోబోతున్నారు. ఈ నిర్ణయం వెలువడిన వెంటనే కాంట్రాక్టు అధ్యాపకులు అన్నమయ్య భవన్‌లో చైర్మన్ బాపిరాజుతో పాటు సభ్యులు ముత్యంరెడ్డి, సూర్యప్రకాశ్, రాజేశ్వరిని కలసి కృతజ్ఞతలు తెలిపారు. తమ సర్వీసు క్రమబద్ధీకరించే విషయం కూడా ఆలోచించాలని విన్నవించారు. కష్టపడి పనిచేస్తే తప్పకుండా న్యాయం చేస్తామని పాలకమండలి సభ్యులు వారికి హామీ ఇచ్చారు.
- తిరుమల వాసులకు శుభవార్త! ఇకపై స్థానికులకు శ్రీవారి దర్శనం సులభంగా దక్కనుంది. ఆర్జిత సేవల్లో ప్రత్యేక కోటా కల్పిస్తూ శుక్రవారం జరిగిన పాలక మండలి నిర్ణయం తీసుకుంది. దీనిపై స్థానికుల్లో హర్షం వ్యక్తమవుతోంది. త్వరలోనే ఈ నిర్ణయాన్ని అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది. దీంతో స్థానికులు ఆనందోత్సాహంలో మునిగిపోయారు
- తిరుమల-తిరుపతి దేవస్థానం మాజీ కార్యనిర్వహణాధికారి కేవీ రమణాచారికి మరోసారి శ్రీవారి సేవాభాగ్యం దక్కింది. దేవాదాయశాఖ ముఖ్య కార్యదర్శిగా పనిచేస్తూ కొంత కాలం కిందట ఆయన స్వచ్ఛంద ఉద్యోగ విరమణ చేశారు.రమణాచారిని పాలకమండలి సలహాదారు హోదాలో టీటీడీలోకి తీసుకురావాలని చైర్మన్ బాపిరాజు యోచిం చారు. ఈ ప్రతిపాదన గురించి సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డితో చర్చించి, అనుమతి తీసుకున్నారు. దీనికి పాలకమండలి సమావేశంలో ఏకగ్రీవ ఆమోదం లభించింది. ఈ విషయం గురించి రమణాచారి స్పందన కోరగా, తనకు అధికారికంగా ఎలాంటి సమాచారం రాలేదని చెప్పారు.
Send This Page To Your Friend
2012
జనవరి
2011
డిసెంబర్
నవంబర్
సెప్టెంబర్
ఆగస్ట్
జులై
మే
ఏప్రిల్
పిబ్రవరి
జనవరి
2010
నవంబర్
సెప్టెంబర్
ఆగస్ట్
ఏప్రిల్
మార్చి
జనవరి
2009
డిసెంబర్
నవంబర్
నవంబర్
సెప్టెంబర్
సెప్టెంబర్
పిబ్రవరి
జనవరి
2008
డిసెంబర్
నవంబర్
జూన్
మే
మార్చి
పిబ్రవరి
జనవరి
2007
డిసెంబర్
నవంబర్
సెప్టెంబర్
ఆగస్ట్
మార్చి
2006
సెప్టెంబర్
జులై
మే
మార్చి
పిబ్రవరి
శ్రీ శ్రీనివాసా గోవిందా
శ్రీ వేంకటేశా గోవిందా
భక్తవత్సలా గోవిందా
భాగవతప్రియ గోవిందా
నిత్యనిర్మలా గోవిందా
నీలమేఘశ్యామ గోవిందా
పురాణపురుష గోవిందా
పుండరీకాక్ష గోవిందా
నందనందనా గోవిందా
నవనీతచోర గోవిందా
పశుపాలకశ్రీ గోవిందా
పాపవిమోచన గోవిందా
దుష్టసంహార గోవిందా
దురితనివారణ గోవిందా
శిష్టపరిపాలక గోవిందా
కష్టనివారణ గోవిందా
వజ్రమకుటధర గోవిందా
వరామమూర్తివి గోవిందా
గోపీజనలోల గోవిందా
గోవర్ధనోద్దార గోవిందా
దశరథనందన గోవిందా
దశముఖమర్దన గోవిందా
పక్షివాహన గోవిందా
పాండవప్రియ గోవిందా
మత్స్యకూర్మా గోవిందా
మధుసూదనహరి గోవిందా
వరాహ నరసింహ గోవిందా
వామన భృగురామ గోవిందా
బలరామానుజ గోవిందా
బౌద్ధకల్కిధర గోవిందా
వేణుగానప్రియ గోవిందా
వేంకటరమణా గోవిందా
సీతానాయక గోవిందా
శ్రీతపరిపాలక గోవిందా
దరిద్రజనపోషక గోవిందా
దర్మసంస్ధాపక గోవిందా
అనాథరక్షక గోవిందా
ఆపద్భాంధక గోవిందా
శరణాగతవత్సల గోవిందా
కరుణాసాగర గోవిందా
కమలదళాక్ష గోవిందా
కామితఫలతాదా గోవిందా
పాపవినాశక గోవిందా
పాహిమురారే గోవిందా
శ్రీముద్రాంకిత గోవిందా
శ్రీవత్సాంకిత గోవిందా
ధరణీనాయక గోవిందా
దినకరతేజా గోవిందా
పద్మావతీప్రియ గోవిందా
ప్రసన్నమూర్తీ గోవిందా
అభయహస్తప్రదర్శన గోవిందా
మర్త్యావతారా గోవిందా
శంఖచక్రధర గోవిందా
శార్జగదాదర గోవిందా
విరజాతీరస్ధ గోవిందా
విరోధిమర్ధన గోవిందా
సాలగ్రామధర గోవిందా
సహస్రనామా గోవిందా
లక్ష్మీవల్లభ గోవిందా
లక్ష్మణాగ్రజ గోవిందా
కస్తూరితిలక గోవింద
కాంచనాంబరధర గోవిందా
గరుడవాహన గోవిందా
వానరసేవిత గోవిందా
వారధిబంధన గోవిందా
ఏడుకొండలవాడ గోవిందా
ఏకస్వరూపా గోవిందా
శ్రీరామకృష్ణ గోవిందా
రఘకులనందన గోవిందా
ప్రత్యక్షదేవా గోవిందా
పరమదయాకర గోవిందా
వజ్రకవచధర గోవిందా
వ్తెజయంతిమాల గోవిందా
వడ్డికాసులవాడ గోవిందా
వసుదేవతనయా గోవిందా
బిల్వపత్రార్చిత గోవిందా
భిక్షుక సంస్తుత గోవిందా
స్త్రీ పుంరూపా గోవిందా
శివేకవకమూర్తి గోవిందా
బ్రహ్మాండరూపా గోవిందా
భక్తరక్షక గోవిందా
నిత్యకల్యాణ గోవిందా
నీరజనాభ గోవిందా
హాతీరామప్రియ గోవిందా
హరిసర్వోత్తమ గోవిందా
జనార్దనమూర్తి గోవిందా
జగత్సాక్షిరూప గోవిందా
అభిషేకప్రియ గోవిందా
అపన్నివారణా గోవిందా
రత్నకిరిటా గోవిందా
రామానుజనుత గోవిందా
స్వయంప్రకాశ గోవిందా
ఆశ్రీతపక్ష గోవిందా
నిత్యసుభప్రధ గోవిందా
నిఖిలలోేకశా గోవిందా
ఆనందరూపా గోవిందా
ఆద్యంతరహితా గోవిందా
ఇహపరదాయక గోవిందా
ఇభరాజరక్షఖ గోవిందా
పరమదయాళో గోవిందా
పద్మనాభహరి గోవిందా
తిరుమలవాసా గోవిందా
తులసీవనమాల గోవిందా
శేషాద్రినిలయ గోవిందా
శ్రీనివాస శ్రీ గోవిందా
శ్రీ వేంకటేశా గోవిందా
గోవిందా హరి గోవిందా
గోకులనందన గోవిందా