జీవిత యుద్ధంలో గెలవడానికి దైర్యానికి మించిన ఆయుధం లేదు
- భగత్ సింగ్
రాశి ఫలాలు
మేషం
గురువు జన్మమందు , శని 7 వ ఇంట , రాహువు 8 వ ఇంట , కేతువు 2 వ ఇంట సంచరిస్తున్నారు. ఆధ్యాత్మికచింతన పెరుగుతుంది. వైద్య , ఇంజనీరింగ్‌ , ఐటి విద్యార్థులకు పురోభివృద్ధి. గృహంలో మార్పులకై చేయు ప్రయత్నాలు అనుకూలం. క్రీడలపట్ల , కళలపట్ల , రచనల పట్ల ఆసక్తి పెరుగుతుంది. ఆర్థిక ఇబ్బందులు తొలగుతాయి. స్థిరాస్థియోగం కలిసి వస్తుంది. బంధుమిత్రుల సహకారంతో ఒకధార్మిక కార్యక్రమానికి బాధ్యత వహించి ప్రశంసలు పొందుతారు. నువ్వులు , బెల్లం , నూనె , వ్యాపారులకు ధనాదాయం. మొదటివారం స్వల్ప ఆదాయం , రెండోవారం కార్యనుకూలత , మూడోవారం స్థిరాస్థియోగం , నాలుగోవారం ధార్మికచింతన.
వృషభం
గురువు 12 వ ఇంట , శని 6 వ ఇంట , రాహువు 7 వ ఇంట , కేతువు జన్మమందు సంచరిస్తున్నారు. ఈ రాశివారికి ఈ మాసంలో నూతన వ్యక్తుల పరిచయం , బంధుమిత్రుల సహకారం పుష్కలంగా వుంటుంది. చేయు వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో బాగా రాణిస్తారు. మొదటివారం వ్యవహారజయం , రెండోవారం ధనలాభం , మూడోవారం ధార్మిక చింతన , నాలుగోవారం క్షేత్రదర్శనం.
మిధునం
గురువు 11 వ ఇంట , శని 5వ ఇంట , కేతువు 12 వ ఇంట , రాహువు 6 వ ఇంట సంచరిస్తున్నారు. చింతించకు గడచిన పని అన్నట్లుగా ఆనందం , ప్రయత్న జయం తదితర శుభ ఫలితాలు ఈ మాసంలో కలుగుతాయి. చేయు వృత్తిఉద్యోగములందు అనుకూలత. మహిళలకు థైరాయిడ్‌వంటి అనారోగ్య సమస్యలు తీవ్రరూపం దాల్చుతాయి. జాగ్రత్త వహించగలరు. శివాభిషేకాలు , నవ్రగహ శాంతి పూజలు మేలు చేస్తాయి. మీరంటే ఇష్టపడే వ్యక్తి మంచితనం మిమ్ములను వారి దగ్గరకు చేరుస్తుంది. తొందరపాటు నిర్ణయాలు వద్దు , గడచిన పనులు వల్ల వృథా ఖర్చు , వృథాశ్రమ అని గ్రహిస్తారు. మొదటివారం అనారోగ్యం , రెండోవారం వృథాఖర్చు , మూడోవారం ప్రయత్నజయం , నాలుగోవారం సంతోషం.
కర్కాటకం
గురువు 10 వ ఇంట , శని 4 వ ఇంట , రాహువు 5 వ ఇంట , కేతువు 11 వ ఇంట సంచరిస్తున్నారు. ఈ మాసంలో ఈ రాశివారికి ముఖ్యమైన కార్యక్రమాలు వాయిదాపడతాయి. గృహంలో ఏవైనా విలువైన వస్తువుపోయే ఆస్కారం ఉంది. అందరితో కలిసి విందు వినోదాల్లో పాల్గంటారు. దూరప్రయాణాలు వద్దు , ఒంటరి ప్రయాణాల వల్ల ప్రమాదం జరిగే అవకాశం ఉంది. సన్నిహితులు ,బంధువులు ఆర్థిక లావాదేవీల్లో మధ్య వర్తిత్వం కోసం ఒత్తిడి తెస్తారు. సున్నితంగా తిరస్కరించడం మంచింది. మొదటివారం అపహరణ , రెండోవారం కార్యజయం , మూడోవారం ప్రమాదం , నాలుగోవారం ఆనందం.
సింహం
గురువు 9 వ ఇంట , శని 3 వ ఇంట , రాహువు 4 ఇంట , కేతువు 10 వ ఇంట సంచరిస్తున్నారు. దూరప్రయాణాలకై చేయు క్షేత్ర దర్శన ప్రయత్నాలు ఫలిస్తాయి. పండ్లు , పూలు వ్యాపారులకు ఆశించిన లాభాలు వస్తాయి. దైవ కార్యక్రమాలలో చురుగ్గా పాల్గొంటారు. గతంలో కొన్ని పొరపాట్లు గ్రహపాటులాగా వెంబడించి మానసిక వేదనకు గురిచేస్తాయి. ప్రముఖులనుండి ఆహ్వానాలందుతాయి. ప్రతివిషయం , ప్రతిపని కొంత ఆలస్యమైన ఫలితం అనుకూలంగా ఉంటుంది. మొదటివారం క్షేత్రదర్శనం , రెండోవారం అపనిందలు , మూడోవారం ప్రయత్నఫలం , నాలుగోవారం శుభవార్తా శ్రవణం.
కన్య
గురువు 8 వ స్థానం , శని 2 వ ఇంట , రాహువు 3 ఇంట , కేతువు 9 వ ఇంట సంచరిస్తున్నారు. ఏలినాటి శనివారం ప్రభావం వల్ల కొన్ని ఇబ్బందులు తప్పవు. ప్రతిమాసం సత్యనారయణ వ్రతం ఆచరిస్తే శుభఫలితాలు వస్తాయి. నమ్మినవ్యక్తుల వల్ల ఆర్థిక సమస్యలు. తల్లిదండ్రుల అనారోగ్యం ఆందోళనకు గురిచేస్తుంది. జాగ్రత్త వహించండి. మొదటివారం శస్త్రచికిత్సలు , రెండోవారం పదవీయోగం , మూడోవారం విలువైన ఆభరణాల కొనుగోలు , నాలుగోవారం దైవారాధన.
తుల
గురువు 7 ఇంట , జన్మరాశియందు శని , రాహువు 2 వ ఇంట , కేతువు 8 వ ఇంట సంచరిస్తున్నారు. ఈ రాశివారికి ఈనెలలో అధికశ్రమతో పనులు పూర్తవుతాయి. దీర్ఘకాలికంగా పెండింగ్‌లో ఉన్నా కోర్టు , భూవివాదాలు పరిష్కారదశకు చేరుతాయి. మొదటివారం వృథాప్రయాణం , వృథాశ్రమ , రెండోవారం ఆందోళన, మూడోవారం అపనిందలు , నాలుగోవారం క్షేత్రదర్శనం.
వృశ్చికం
గురువు 6 వ ఇంట , శని 12వ ఇంట , రాహువు జన్మనక్షత్రమందు , కేతువు 7 వ ఇంట సంచరిస్తున్నారు. ఈమాసంలో ఈ రాశివారికి గృహంలో మార్పు , చేర్పులకు అనుకూలం. మిత్రుల సహకారాల వల్ల ఆర్థిక ఇబ్బంది అంటూ ఉండదు. దూరప్రయాణాలు క్షేత్రదర్శనాలు అనుకూలం. ఆరోగ్య , విద్యా , ఉద్యోగ , వివాహం కోసం నవగ్రహ దోషనివారణ పూజలు ఆచరిస్తే మంచిది. మొదటివారం గృహమార్పు , రెండోవారం ఆరోగ్యభంగం , మూడోవారం దోషపూజలు , నాలుగోవారం ప్రయత్నఫలం.
ధనుస్సు
గురువు 5వ ఇంట , శని 11వ ఇంట , రాహువు 12 వ ఇంట, కేతువు 6 వ ఇంట సంచరిస్తున్నాయి. నూతన వ్యక్తల పరిచయం ఎంతో సంతృప్తినిస్తుంది. ఉపాధ్యాయులకు , రెవెన్యూ , బ్యాంకు , ఆర్‌.టి.సి రైల్వేఉద్యోగులకు స్థానచలనం , పదోన్నతి ప్రక్రియలు మానసికానందాన్నిస్తాయి. వ్యాపారులకు అదృష్టకాలం. వివాహప్రయత్నాలు , విద్యా ఉద్యోగ ప్రయత్నాలు ఓ కొలిక్కి వచ్చే అవకాశం ఉంది. నిర్మాణ ప్రయత్నాలు నెరవేరుతాయి. మొదటివారం స్థానచలనం , రెండోవారం ఆదాయం , మూడోవారం దైవచింతన , నాలుగోవారం మానసికానందం.
మకరం
గురువు 4 వ ఇంట , శని 10 వ ఇంట , రాహువు , 11వ ఇంట , కేతువు 5 వ ఇంట సంచరిస్తున్నారు. దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న భూవివాదాలు , కోర్టు వ్యవహారాలు పరిష్కరింపబడుతాయి. విద్యార్థులకు ఉన్నత విద్యాభ్యాసం , విదేశీ ప్రయాణాలు కలిసివస్తాయి. మొదటివారం ప్రశంసలు , రెండోవారం ఆనందం , మూడోవారం ధార్మికచింతన , నాలుగోవారం ధనప్రాప్తి.
కుంభం
గురువు 3 వ ఇంట శని , 9 వ ఇంట , రాహువు 10 వ ఇంట కేతువు , 4 వ ఇంట సంచరిస్తున్నారు. శుభకార్యాలకు చేసే ప్రయత్నాలు ఆలస్యంగానైనా పరిపూర్ణమౌతాయి. ధార్మిక సేవ , చింతన పెరుగుతుంది. మిమ్మల్ని చూసి అసూయ పడే వారు అధికమౌతారు. బంధువుల రాకపోకలు పెరుగుతాయి. మొదటివారం కార్యజయం , రెండోవారం పదవీప్రాప్తి , మూడోవారం శుభవార్తలు , నాలుగోవారం లక్ష్యసాధన.
మీనం
గురువు 2 వ ఇంట , శని 8 వ ఇంట , రాహువు 9 వ ఇంట , కేతువు 3 వ ఇంట సంచరిస్తున్నారు. ఈ మాసంలో ఈ రాశివారికి కార్యవిఘ్నత. అధికారులతో కలహాలు , ఆత్మీయులతో ఎడబాటు , ప్రమాదాలు తదితర అశుభఫలితాలు. ఏర్పడే అవకాశం ఉంది. దైవచింతన పట్ల ఆసక్తి పెరుగుతుంది. ఇంట్లో శుభకార్యం ఆనందాన్నిస్తుంది. మొదటివారం కలహాలు , రెండోవారం వృథాఖర్చులు , మూడోవారం శుభకార్యం , నాలుగోవారం పుణ్యక్షేత్రదర్శనం.
Send This Page To Your Friend
శ్రీ శ్రీనివాసా గోవిందా శ్రీ వేంకటేశా గోవిందా భక్తవత్సలా గోవిందా భాగవతప్రియ గోవిందా నిత్యనిర్మలా గోవిందా నీలమేఘశ్యామ గోవిందా పురాణపురుష గోవిందా పుండరీకాక్ష గోవిందా నందనందనా గోవిందా నవనీతచోర గోవిందా పశుపాలకశ్రీ గోవిందా పాపవిమోచన గోవిందా దుష్టసంహార గోవిందా దురితనివారణ గోవిందా శిష్టపరిపాలక గోవిందా కష్టనివారణ గోవిందా వజ్రమకుటధర గోవిందా వరామమూర్తివి గోవిందా గోపీజనలోల గోవిందా గోవర్ధనోద్దార గోవిందా దశరథనందన గోవిందా దశముఖమర్దన గోవిందా పక్షివాహన గోవిందా పాండవప్రియ గోవిందా మత్స్యకూర్మా గోవిందా మధుసూదనహరి గోవిందా వరాహ నరసింహ గోవిందా వామన భృగురామ గోవిందా బలరామానుజ గోవిందా బౌద్ధకల్కిధర గోవిందా వేణుగానప్రియ గోవిందా వేంకటరమణా గోవిందా సీతానాయక గోవిందా శ్రీతపరిపాలక గోవిందా దరిద్రజనపోషక గోవిందా దర్మసంస్ధాపక గోవిందా అనాథరక్షక గోవిందా ఆపద్భాంధక గోవిందా శరణాగతవత్సల గోవిందా కరుణాసాగర గోవిందా కమలదళాక్ష గోవిందా కామితఫలతాదా గోవిందా పాపవినాశక గోవిందా పాహిమురారే గోవిందా శ్రీముద్రాంకిత గోవిందా శ్రీవత్సాంకిత గోవిందా ధరణీనాయక గోవిందా దినకరతేజా గోవిందా పద్మావతీప్రియ గోవిందా ప్రసన్నమూర్తీ గోవిందా అభయహస్తప్రదర్శన గోవిందా మర్త్యావతారా గోవిందా శంఖచక్రధర గోవిందా శార్జగదాదర గోవిందా విరజాతీరస్ధ గోవిందా విరోధిమర్ధన గోవిందా సాలగ్రామధర గోవిందా సహస్రనామా గోవిందా లక్ష్మీవల్లభ గోవిందా లక్ష్మణాగ్రజ గోవిందా కస్తూరితిలక గోవింద కాంచనాంబరధర గోవిందా గరుడవాహన గోవిందా వానరసేవిత గోవిందా వారధిబంధన గోవిందా ఏడుకొండలవాడ గోవిందా ఏకస్వరూపా గోవిందా శ్రీరామకృష్ణ గోవిందా రఘకులనందన గోవిందా ప్రత్యక్షదేవా గోవిందా పరమదయాకర గోవిందా వజ్రకవచధర గోవిందా వ్తెజయంతిమాల గోవిందా వడ్డికాసులవాడ గోవిందా వసుదేవతనయా గోవిందా బిల్వపత్రార్చిత గోవిందా భిక్షుక సంస్తుత గోవిందా స్త్రీ పుంరూపా గోవిందా శివేకవకమూర్తి గోవిందా బ్రహ్మాండరూపా గోవిందా భక్తరక్షక గోవిందా నిత్యకల్యాణ గోవిందా నీరజనాభ గోవిందా హాతీరామప్రియ గోవిందా హరిసర్వోత్తమ గోవిందా జనార్దనమూర్తి గోవిందా జగత్సాక్షిరూప గోవిందా అభిషేకప్రియ గోవిందా అపన్నివారణా గోవిందా రత్నకిరిటా గోవిందా రామానుజనుత గోవిందా స్వయంప్రకాశ గోవిందా ఆశ్రీతపక్ష గోవిందా నిత్యసుభప్రధ గోవిందా నిఖిలలోేకశా గోవిందా ఆనందరూపా గోవిందా ఆద్యంతరహితా గోవిందా ఇహపరదాయక గోవిందా ఇభరాజరక్షఖ గోవిందా పరమదయాళో గోవిందా పద్మనాభహరి గోవిందా తిరుమలవాసా గోవిందా తులసీవనమాల గోవిందా శేషాద్రినిలయ గోవిందా శ్రీనివాస శ్రీ గోవిందా శ్రీ వేంకటేశా గోవిందా గోవిందా హరి గోవిందా గోకులనందన గోవిందా
Copyright © 2007 ttdnews.com , All rights reserved.
This site is owned and managed by Editor, Kaliyuga Narada Monthly , Tirumala - Tirupati.