జీవిత యుద్ధంలో గెలవడానికి దైర్యానికి మించిన ఆయుధం లేదు
- భగత్ సింగ్
కాల్ టు టిటిడి ఈవో
తిరుపతిలో భక్తులకు సమస్యల వెల్లువ
డయల్‌ యువర్‌ ఈవోలో భక్తుడు ఫిర్యాదు
తిరుపతిలో శ్రీవారి భక్తులు సమస్యలు ఎదుర్కొంటున్నారని తితిదే ఈవో ఎల్వీ సుబ్రమణ్యంకు ఫిర్యాదు చేశారు. తిరుమలలో డయల్‌ యువర్‌ తితిదే ఈవో కార్యక్రమాన్ని శుక్రవారం నిర్వహించారు. ఈ సందర్భంగా భక్తులు అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇచ్చారు. కార్యక్రమంలో తితిదే జేఈవో శ్రీనివాసరాజు, సీవీఎస్‌వో ఎం.కె.సింగ్‌, సీఈ చంద్రశేఖరరెడ్డి, ఎస్‌ఈ రమేష్‌రెడ్డి, ఆరోగ్య అధికారి భీష్మయ్యనాయుడు, ఈడీపీ మేనేజరు భాస్కర్‌, రవాణా విభాగం జీఎం శేషారెడ్డి, పీఆర్వో రవి, ఏపీఆర్వో నీలిమారావు పాల్గొన్నారు.
ఇంకా పలువురు భక్తులు అడిగిన ప్రశ్నలు, ఈవో సమాధానాలు:

మహతి ఆడిటోరియం భక్తులకు ఉపయోగపడటంలేదని, స్థానికులకే పరిమితమవుతోందని వివరించారు. విష్ణు నివాసం స్థానంలో ఆడిటోరియం నిర్మించి ఉంటే రైళ్లకు, బస్సులకు వేచి ఉండే భక్తులు కాలక్షేపం చేయడానికి ఉపయోగంగా ఉండేదనే అభిప్రాయం వ్యక్తం చేశారు. విష్ణు నివాసం చుట్టూ రహదారుల ఆక్రమణ, ప్రైవేటు వాహనాలు విచ్చలవిడిగా సంచారం, పవిత్రతకు భంగం కలిగే కార్యక్రమాలు జరుగుతున్నాయని వివరించారు. : తిరుపతి , కృష్ణ
.
ఈ సలహాలపై ఇఓ సానుకూలంగా స్పందించారు. భక్తుల సౌకర్యార్థం ఆర్టీసీ బస్టాండ్‌ , శ్రీనివాసం , రైల్వేస్టేషన్ల వద్ద ఆక్రమణలు కూడా తొలగిస్తామన్నారు.
.

ఇంటర్‌నెట్‌లో ఆర్జితసేవలబుక్కింగ్‌ నగదు చెల్లింపుల్లో సిటీబ్యాంకు కార్డులు మాత్రమే ఆమోదిస్తున్నారని , ఇతర బ్యాంకులు కూడా ప్రవేశపెట్టాలని కోరారు. : కర్ణాటక రాష్ట్రం ,రాజు
.
తప్పకుండా ప్రవేశపెడతామని ఈవో తెలిపారు.
.

పిల్లలతో ఆధ్యాత్మిక నాటికలు, భక్తప్రహ్లాద, భక్త మార్కండేయ వంటి పురాణగాధలు రూపొందించి శ్రీవేంకటేశ్వర భక్తిఛానల్‌లో ప్రసారం చేయాలని భక్తురాలు సూచించారు. : హైదరాబాదు , రాణి
.
ఇలాంటి కార్య్రకమాలు రూపొందించడానికే తాము ఎస్‌వి భక్తి చానల్‌-2 ను ప్రారంభించదలిచామని , విమర్శకులు «ధనవ్యయం అవుతుందని విమర్శలు లేవనెత్తడంతో ఆ ప్రతిపాదన మరుగున పడిందన్నారు. భక్తుల సూచనలతో విమర్శకులు ఈ చానల్‌ అవసరాన్ని గుర్తించాలన్నారు.
.

మందిరంలోని వెండివాకిలి లోపు తోపులాటలు, లాటరీ ద్వారా టిక్కెట్ల కేటాయింపు సమాచార లోపంపైఫిర్యాదు చేశారు. : చెన్నై, ప్రవీణ్‌కుమార్‌
.
తప్పకుండా త్వరలోనే అమలుపరుస్తామని సమాధానమిచ్చారు.

ప్రత్యేక ప్రవేశ దర్శనం మరింత ఆలస్యం జరుగుతోందని ఈవో దృష్టికి చేశారు. : బెంగుళూరు , శాంతి
.
తప్పకుండా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.
.

రథసప్తమి రోజు ఆలయంలో ప్రసాదాలు ఇవ్వకుండా నిలిపివేశారని ఈవోకు ఫిర్యాదు చేశారు. ఆలయంలోకి వెళ్లే సమయంలో భక్తులు సంప్రదాయ వస్త్రధారణను పాటించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. : చంద్రగిరి , గాయత్రి
.
రథసప్తమి పర్వదినాన్ని విజయవంతంగా నిర్వహించామనే అభిప్రాయం వ్యక్తమైందని, వచ్చే ఏడాది మరింతగా నిర్వహణకు చర్యలు తీసుకుంటామన్నారు. సంప్రదాయ వస్త్రధారణ భక్తులు పాటించేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.
.

మాజీ సైనికులకు శ్రీవారి ఆలయంలోకి సుపథం ప్రవేశంలో అనుమతించడంలేదని ఫిర్యాదు చేశారు. : లక్ష్మీ నరసింహశర్మ ,కడప
.
మాజీ సైనికులను సుపథం ప్రవేశం నుంచి శ్రీవారి ఆలయంలోకి వెళ్లవచ్చునని తెలిపారు.
.

టిటిడి విద్యాసంస్థల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయులను రెగ్యులరైజ్ చేశారా ? : అనంతపురానికి చెందిన గీత
.
ఒప్పంద ప్రాతిపదికన పని చేస్తున్న అధ్యాపకులకు కనీస వేతనాలు చెల్లింపునకు చర్యలు తీసుకున్నామని, రెగులరైజేషన్‌ యోచన ప్రస్తుతానికి లేదని , అది రాష్ట్రప్రభుత్వ పరిధిలోనిదని స్పష్టం చేశారు.
.
Send This Page To Your Friend
ప్రతి నెల మొదటి శుక్రవారం ఉదయం 8.30 నుంచి 9.30 గంటల వరకు తిరుమలలోని ఈవో క్యాంప్ కార్యాలయంలో కాల్ టు ఈవో కార్యక్రమం జరుగుతుంది. 0877-2263261 కు భక్తులు ఫోన్ చేసి టిటిడికి తమ సూచనలు, సలహాలు, ఫిర్యాదులు తెలపవచ్చు. ఇందులో టిటిడి ఈ.వో గాని జె.ఎ.వొ. గాని పాల్గొంటారు. వారే ఫోన్ తీసుకొని, భక్తులు ఇచ్చే సూచనలు, సలహాలు, ఫిర్యాదులను స్వీకరిస్తారు. ఇందులో మీరు ఏ నెల కాల్ టు టిటిడి ఈవో కావాలనుకుంటే ఆ నెల వివరాలను చూడవచ్చు.
శ్రీ శ్రీనివాసా గోవిందా శ్రీ వేంకటేశా గోవిందా భక్తవత్సలా గోవిందా భాగవతప్రియ గోవిందా నిత్యనిర్మలా గోవిందా నీలమేఘశ్యామ గోవిందా పురాణపురుష గోవిందా పుండరీకాక్ష గోవిందా నందనందనా గోవిందా నవనీతచోర గోవిందా పశుపాలకశ్రీ గోవిందా పాపవిమోచన గోవిందా దుష్టసంహార గోవిందా దురితనివారణ గోవిందా శిష్టపరిపాలక గోవిందా కష్టనివారణ గోవిందా వజ్రమకుటధర గోవిందా వరామమూర్తివి గోవిందా గోపీజనలోల గోవిందా గోవర్ధనోద్దార గోవిందా దశరథనందన గోవిందా దశముఖమర్దన గోవిందా పక్షివాహన గోవిందా పాండవప్రియ గోవిందా మత్స్యకూర్మా గోవిందా మధుసూదనహరి గోవిందా వరాహ నరసింహ గోవిందా వామన భృగురామ గోవిందా బలరామానుజ గోవిందా బౌద్ధకల్కిధర గోవిందా వేణుగానప్రియ గోవిందా వేంకటరమణా గోవిందా సీతానాయక గోవిందా శ్రీతపరిపాలక గోవిందా దరిద్రజనపోషక గోవిందా దర్మసంస్ధాపక గోవిందా అనాథరక్షక గోవిందా ఆపద్భాంధక గోవిందా శరణాగతవత్సల గోవిందా కరుణాసాగర గోవిందా కమలదళాక్ష గోవిందా కామితఫలతాదా గోవిందా పాపవినాశక గోవిందా పాహిమురారే గోవిందా శ్రీముద్రాంకిత గోవిందా శ్రీవత్సాంకిత గోవిందా ధరణీనాయక గోవిందా దినకరతేజా గోవిందా పద్మావతీప్రియ గోవిందా ప్రసన్నమూర్తీ గోవిందా అభయహస్తప్రదర్శన గోవిందా మర్త్యావతారా గోవిందా శంఖచక్రధర గోవిందా శార్జగదాదర గోవిందా విరజాతీరస్ధ గోవిందా విరోధిమర్ధన గోవిందా సాలగ్రామధర గోవిందా సహస్రనామా గోవిందా లక్ష్మీవల్లభ గోవిందా లక్ష్మణాగ్రజ గోవిందా కస్తూరితిలక గోవింద కాంచనాంబరధర గోవిందా గరుడవాహన గోవిందా వానరసేవిత గోవిందా వారధిబంధన గోవిందా ఏడుకొండలవాడ గోవిందా ఏకస్వరూపా గోవిందా శ్రీరామకృష్ణ గోవిందా రఘకులనందన గోవిందా ప్రత్యక్షదేవా గోవిందా పరమదయాకర గోవిందా వజ్రకవచధర గోవిందా వ్తెజయంతిమాల గోవిందా వడ్డికాసులవాడ గోవిందా వసుదేవతనయా గోవిందా బిల్వపత్రార్చిత గోవిందా భిక్షుక సంస్తుత గోవిందా స్త్రీ పుంరూపా గోవిందా శివేకవకమూర్తి గోవిందా బ్రహ్మాండరూపా గోవిందా భక్తరక్షక గోవిందా నిత్యకల్యాణ గోవిందా నీరజనాభ గోవిందా హాతీరామప్రియ గోవిందా హరిసర్వోత్తమ గోవిందా జనార్దనమూర్తి గోవిందా జగత్సాక్షిరూప గోవిందా అభిషేకప్రియ గోవిందా అపన్నివారణా గోవిందా రత్నకిరిటా గోవిందా రామానుజనుత గోవిందా స్వయంప్రకాశ గోవిందా ఆశ్రీతపక్ష గోవిందా నిత్యసుభప్రధ గోవిందా నిఖిలలోేకశా గోవిందా ఆనందరూపా గోవిందా ఆద్యంతరహితా గోవిందా ఇహపరదాయక గోవిందా ఇభరాజరక్షఖ గోవిందా పరమదయాళో గోవిందా పద్మనాభహరి గోవిందా తిరుమలవాసా గోవిందా తులసీవనమాల గోవిందా శేషాద్రినిలయ గోవిందా శ్రీనివాస శ్రీ గోవిందా శ్రీ వేంకటేశా గోవిందా గోవిందా హరి గోవిందా గోకులనందన గోవిందా
Copyright © 2007 ttdnews.com , All rights reserved.
This site is owned and managed by Editor, Kaliyuga Narada Monthly , Tirumala - Tirupati.