మనిషి తత్వం ఎప్పుడూ ఒకటే. అలవాట్ల కారణంగానే అతడు ఇతరులకు దూరం అవుతాడు.
- కన్ఫ్యూషియస్
వెంకన్నా మాపై దయపెట్టన్నా
తిరుమల శ్రీవారికి నిరుద్యోగుల మొర
తిరుపతి , జులై 30 :
తిరుమల తిరుపతి దేవస్థానం పరిధిలో 399 ఉద్యోగాలు భర్తీచేయుటకు రంగం సిద్ధం చేసినట్లు టిటిడి వెల్లడించింది. జిల్లాలోని లక్షలాది నిరుద్యోగులు ఆశలకు రెక్కలొచ్చాయి. టిటిడిలో ఉద్యోగం అంటే ప్రతి నిరుద్యోగి ఎగిరి గంతేస్తాడనేది నిర్వివాదాంశం, అదీ ఒకేసారి మూడు వందల ఉద్యోగాలు భర్తీ మాటలా. పైగా టిటిడి స్వతంత్ర ప్రతిపత్తి ఉన్న ఏకైక అతిపెద్ద «ధార్మిక సంస్థ. ఇక్కడ ప్రభుత్వం పెత్తనం ఉండదు. కేవలం టిటిడి ఎగ్జిక్యూటివ్‌ ఆఫీసరు , టిటిడి ఛైర్మన్‌ కనుసన్నలలో ఉద్యోగ నియామకాలు జరుగుతాయనేది జగమెరిగిన సత్యం.

కొంచెం కష్టపడితే ఒక మంత్రితోనో లేక ఒక శాసనసభ్యుని సిఫార్సుతో ఉద్యోగం దక్కించుకొనవచ్చని పాపం జిల్లాలోని నిరుద్యోగుల గట్టి నమ్మకం. ఎవరి దారులు వారికున్నాయి. జిల్లాలో చాలాకాలం తర్వాత ఇంత పెద్ద ఎత్తున ఉద్యోగ నియామకాలు చేపట్టడం ఇదే తొలిసారి గావడంతో జిల్లాలో వేలాదిమంది నిరుద్యోగులు నానాయాతనలు భరించి ఆన్‌లైన్‌ ద్వారా తమ దరఖాస్తులు పంపుకొనడం ఒక చిన్న యుద్దంలో ముగింపు దశకు చేరుకుంది. అధికార సమాచారం మేరకు ఇప్పటి వరకు లక్షమంది నిరుద్యోగులు దరఖాస్తు చేసుకుని తమ అదృష్టం పరీక్షించుకొనేందుకు చకోర పక్షుల్లా ఎదురు చూస్తున్నారు.
నిరుద్యోగుల సమస్యలు వర్ణనాతీతం
టిటిడి ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునేందుకు నిరుద్యోగ అభ్యర్థులు సవాలక్ష సవాళ్లను అధిగమించవలసి వచ్చింది . దరఖాస్తు చేసుకున్న ప్రతి నిరుద్యోగ అభ్యర్థి ఆన్‌లైన్‌లో పంపించేందుకు రూ. 30 లు ఇంటర్‌నెట్‌ సెంటరుకు సమర్పించుకొనవలసి వచ్చింది. దీనితో బాటు ఓపన్‌ కేటగిరి అభ్యర్థులు రూ. 200 లు , ఇతరులు రూ.100 స్టేట్‌బ్యాంకులో చలాన తీసుకొనడం నిరుద్యోగులకు అనివార్యం అయింది. బ్యాంకులు , బీమా సంస్థలు , కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాల ఫీజుల విషయంలో ఏలాంటి రాయితీ ఉండదు.

కోట్లకు పడగలెత్తిన తిరుమల వెంకన్నకు నిరుద్యోగులు కష్టపడి చెల్లించే దరఖాస్తు ఫీజు పెద్ద లెక్కలోకి రాదు. శ్రీవారి సేవకు పోటీ పడుతున్న నిరుద్యోగులకు ఉచితంగా దరఖాస్తు పంపుకొనేందుకు టిటిడి వీలు కల్పించడం సముచితం.
నిరుద్యోగులకు ఒకింత ఊరట కలిగి ఉండేది. ఈ విషయంలో టిటిడి పాలక వర్గం పునరాలోచించి నిరుద్యోగులు చెల్లించిన దరఖాస్తు ఫీజును తిరిగి వారికి చెల్లించడం ఆవశ్యం. భవిష్యత్తులో టిటిడి సంస్థ చేపట్టనున్న ఉద్యోగాల ప్రక్రియలో నిరుద్యోగులకు ఉచితంగా దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించేందుకు చర్యలు చేపడుతుందని ఆశించవచ్చును.

ప్రవేశపరీక్షపై ఉత్కంఠం

టిటిడి ఉద్యోగ నియామకాలపై పలు పుకార్లు షికార్లు చేస్తున్నాయి. దళారులు రంగ ప్రవేశం చేసి ప్రతి ఉద్యోగానికి రేటు ఖరారు చేసినట్లు సమాచారం. టిటిడి ఉద్యోగులను ఇప్పిస్తామని రూ. 5 లక్షలు ముట్టచెపితే ఉద్యోగం గ్యారంటీ అని నిరుద్యోగులను నమ్మించేందుకు దళారులు రంగ ప్రవేశం చేసినట్లు సమాచారం. ఇదిలా ఉండగా టిటిడి ఉద్యోగాలకు ప్రవేశ పరీక్ష సమీప భవిష్యత్త్తులో ఉండకపోవచ్చని టిటిడి వర్గాలు వెల్లడిస్తున్నాయి. శ్రీవారి బ్రహ్మోత్సవాలు తరువాతనే ప్రవేశ పరీక్ష ఉంటుందని వినికిడి. రాత పరీక్షలో మెరిట్‌ ఆధారంగా నియామకాలు జరుగుతాయని టిటిడి కార్యనిర్వహణాధికారి ఒక ప్రకటనలో వెల్లడించడం కొసమెరుపు.
ఇతర వార్తలు
శ్రీ శ్రీనివాసా గోవిందా శ్రీ వేంకటేశా గోవిందా భక్తవత్సలా గోవిందా భాగవతప్రియ గోవిందా నిత్యనిర్మలా గోవిందా నీలమేఘశ్యామ గోవిందా పురాణపురుష గోవిందా పుండరీకాక్ష గోవిందా నందనందనా గోవిందా నవనీతచోర గోవిందా పశుపాలకశ్రీ గోవిందా పాపవిమోచన గోవిందా దుష్టసంహార గోవిందా దురితనివారణ గోవిందా శిష్టపరిపాలక గోవిందా కష్టనివారణ గోవిందా వజ్రమకుటధర గోవిందా వరామమూర్తివి గోవిందా గోపీజనలోల గోవిందా గోవర్ధనోద్దార గోవిందా దశరథనందన గోవిందా దశముఖమర్దన గోవిందా పక్షివాహన గోవిందా పాండవప్రియ గోవిందా మత్స్యకూర్మా గోవిందా మధుసూదనహరి గోవిందా వరాహ నరసింహ గోవిందా వామన భృగురామ గోవిందా బలరామానుజ గోవిందా బౌద్ధకల్కిధర గోవిందా వేణుగానప్రియ గోవిందా వేంకటరమణా గోవిందా సీతానాయక గోవిందా శ్రీతపరిపాలక గోవిందా దరిద్రజనపోషక గోవిందా దర్మసంస్ధాపక గోవిందా అనాథరక్షక గోవిందా ఆపద్భాంధక గోవిందా శరణాగతవత్సల గోవిందా కరుణాసాగర గోవిందా కమలదళాక్ష గోవిందా కామితఫలతాదా గోవిందా పాపవినాశక గోవిందా పాహిమురారే గోవిందా శ్రీముద్రాంకిత గోవిందా శ్రీవత్సాంకిత గోవిందా ధరణీనాయక గోవిందా దినకరతేజా గోవిందా పద్మావతీప్రియ గోవిందా ప్రసన్నమూర్తీ గోవిందా అభయహస్తప్రదర్శన గోవిందా మర్త్యావతారా గోవిందా శంఖచక్రధర గోవిందా శార్జగదాదర గోవిందా విరజాతీరస్ధ గోవిందా విరోధిమర్ధన గోవిందా సాలగ్రామధర గోవిందా సహస్రనామా గోవిందా లక్ష్మీవల్లభ గోవిందా లక్ష్మణాగ్రజ గోవిందా కస్తూరితిలక గోవింద కాంచనాంబరధర గోవిందా గరుడవాహన గోవిందా వానరసేవిత గోవిందా వారధిబంధన గోవిందా ఏడుకొండలవాడ గోవిందా ఏకస్వరూపా గోవిందా శ్రీరామకృష్ణ గోవిందా రఘకులనందన గోవిందా ప్రత్యక్షదేవా గోవిందా పరమదయాకర గోవిందా వజ్రకవచధర గోవిందా వ్తెజయంతిమాల గోవిందా వడ్డికాసులవాడ గోవిందా వసుదేవతనయా గోవిందా బిల్వపత్రార్చిత గోవిందా భిక్షుక సంస్తుత గోవిందా స్త్రీ పుంరూపా గోవిందా శివేకవకమూర్తి గోవిందా బ్రహ్మాండరూపా గోవిందా భక్తరక్షక గోవిందా నిత్యకల్యాణ గోవిందా నీరజనాభ గోవిందా హాతీరామప్రియ గోవిందా హరిసర్వోత్తమ గోవిందా జనార్దనమూర్తి గోవిందా జగత్సాక్షిరూప గోవిందా అభిషేకప్రియ గోవిందా అపన్నివారణా గోవిందా రత్నకిరిటా గోవిందా రామానుజనుత గోవిందా స్వయంప్రకాశ గోవిందా ఆశ్రీతపక్ష గోవిందా నిత్యసుభప్రధ గోవిందా నిఖిలలోేకశా గోవిందా ఆనందరూపా గోవిందా ఆద్యంతరహితా గోవిందా ఇహపరదాయక గోవిందా ఇభరాజరక్షఖ గోవిందా పరమదయాళో గోవిందా పద్మనాభహరి గోవిందా తిరుమలవాసా గోవిందా తులసీవనమాల గోవిందా శేషాద్రినిలయ గోవిందా శ్రీనివాస శ్రీ గోవిందా శ్రీ వేంకటేశా గోవిందా గోవిందా హరి గోవిందా గోకులనందన గోవిందా
Copyright © 2007 ttdnews.com , All rights reserved.
This site is owned and managed by Editor, Kaliyuga Narada Monthly , Tirumala - Tirupati.