మనిషి తత్వం ఎప్పుడూ ఒకటే. అలవాట్ల కారణంగానే అతడు ఇతరులకు దూరం అవుతాడు.
- కన్ఫ్యూషియస్
రాయల ఆభరణాల గుర్తింపు ప్రక్రియ ప్రారంభం
తిరుమలకు ఆర్కియాలజీ నిపుణుల రాక
నిపుణుల అధికారులతో తిరుపతి జేఈవో భేటీ
తిరుమల , జులై 30 :
తిరుమల శ్రీ వెంకటేశ్వరస్వామికి శ్రీకృష్ణదేవరాయలు సమర్పించిన ఆభరణాలు కరిగించారని కొంతకాలంగా పుకార్లు షికార్లు చేస్తున్న నేపథ్యంలో పురాతన ఆభరణాలు ఏ కాలంనాటివో గుర్తించేందుకు టిటిడి రంగంలోకి దిగింది. పురావస్తుశాఖకు చెందిన ఐదుగురు నిపణుల బృందం బుధవారం నుంచి ఈ ప్రక్రియకు శ్రీకారం చుట్టింది.
శ్రీ కృష్ణదేవరాయలు తిరుమలేశునికి సమర్పించిన కానుకల్లో కొన్నింటిని కరిగించారనీ , మరికొన్ని మాయమయ్యాయని ఇటీవల పుకార్లు చెలరేగిన విషయం తెలిసిందే.

స్వామివారి ఆభరణాలన్నీ భద్రంగానే ఉన్నాయనీ , ఇందులో కృష్ణదేవరాయలు ఇచ్చిన ఆభరణాలేవో గుర్తించే శక్తి తమకు లేదని టిటిడి ప్రకటించింది. పురాతన ఆభరణాలను పరిశీలించి అవి ఏకాలం నాటివో గుర్తించడానికి పురావస్తు నిపుణులను రప్పిస్తామని చెప్పింది. ఈ మేరకు ఈవో కృష్ణారావు రాష్ట్ర ప్రభుత్వానికి , పురావస్తుశాఖ డైరెక్టర్‌కు లేఖలు రాశారు. దీంతో పురావస్తుశాఖ ఐదుగురు అధికారులు బృందానికి ఈ పని అప్పగించింది. ఈ బృందం బుధవారం తిరుపతిలోని టిటిడి పరిపాలనా భవనంలో జేఈవో యువరాజ్‌ ట్రెజరీ , ఆలయ విబాగాల అధికారులతో సమావేశమైంది.

దేవస్థానం వద్ద ఉన్న పురాతన ఆభరణాలకు సంంధించిన చారిత్రక శాసనాలను టిటిడి రికార్డుల్లోని వివరాలతో సరిపోల్చి ఆభరణాలు ఏకాలం నాటివో గుర్తించేందుకు నిర్ణయించారు. ఆభరణాల గుర్తింపు ప్రక్రియ ఎలా ఉండాలి , ఎలా చేయాలి ? దీని విధి విధానాలు ఎలా ఉండాలనే దానిపై అధికారులతో ఈ బృందం చర్చించింది. రెండు , మూడు రోజుల్లో ఆభరణాల గుర్తింపు ప్రక్రియ ప్రారంభించేందుకు నిర్ణయించాలని తెలిసింది. పురావస్తు శాఖకు చెందిన ఇంకొందరు సిబ్బంది రెండు , మూడురోజుల్లో తిరుమలకు రానున్నట్లు సమాచారం.
ఇతర వార్తలు
శ్రీ శ్రీనివాసా గోవిందా శ్రీ వేంకటేశా గోవిందా భక్తవత్సలా గోవిందా భాగవతప్రియ గోవిందా నిత్యనిర్మలా గోవిందా నీలమేఘశ్యామ గోవిందా పురాణపురుష గోవిందా పుండరీకాక్ష గోవిందా నందనందనా గోవిందా నవనీతచోర గోవిందా పశుపాలకశ్రీ గోవిందా పాపవిమోచన గోవిందా దుష్టసంహార గోవిందా దురితనివారణ గోవిందా శిష్టపరిపాలక గోవిందా కష్టనివారణ గోవిందా వజ్రమకుటధర గోవిందా వరామమూర్తివి గోవిందా గోపీజనలోల గోవిందా గోవర్ధనోద్దార గోవిందా దశరథనందన గోవిందా దశముఖమర్దన గోవిందా పక్షివాహన గోవిందా పాండవప్రియ గోవిందా మత్స్యకూర్మా గోవిందా మధుసూదనహరి గోవిందా వరాహ నరసింహ గోవిందా వామన భృగురామ గోవిందా బలరామానుజ గోవిందా బౌద్ధకల్కిధర గోవిందా వేణుగానప్రియ గోవిందా వేంకటరమణా గోవిందా సీతానాయక గోవిందా శ్రీతపరిపాలక గోవిందా దరిద్రజనపోషక గోవిందా దర్మసంస్ధాపక గోవిందా అనాథరక్షక గోవిందా ఆపద్భాంధక గోవిందా శరణాగతవత్సల గోవిందా కరుణాసాగర గోవిందా కమలదళాక్ష గోవిందా కామితఫలతాదా గోవిందా పాపవినాశక గోవిందా పాహిమురారే గోవిందా శ్రీముద్రాంకిత గోవిందా శ్రీవత్సాంకిత గోవిందా ధరణీనాయక గోవిందా దినకరతేజా గోవిందా పద్మావతీప్రియ గోవిందా ప్రసన్నమూర్తీ గోవిందా అభయహస్తప్రదర్శన గోవిందా మర్త్యావతారా గోవిందా శంఖచక్రధర గోవిందా శార్జగదాదర గోవిందా విరజాతీరస్ధ గోవిందా విరోధిమర్ధన గోవిందా సాలగ్రామధర గోవిందా సహస్రనామా గోవిందా లక్ష్మీవల్లభ గోవిందా లక్ష్మణాగ్రజ గోవిందా కస్తూరితిలక గోవింద కాంచనాంబరధర గోవిందా గరుడవాహన గోవిందా వానరసేవిత గోవిందా వారధిబంధన గోవిందా ఏడుకొండలవాడ గోవిందా ఏకస్వరూపా గోవిందా శ్రీరామకృష్ణ గోవిందా రఘకులనందన గోవిందా ప్రత్యక్షదేవా గోవిందా పరమదయాకర గోవిందా వజ్రకవచధర గోవిందా వ్తెజయంతిమాల గోవిందా వడ్డికాసులవాడ గోవిందా వసుదేవతనయా గోవిందా బిల్వపత్రార్చిత గోవిందా భిక్షుక సంస్తుత గోవిందా స్త్రీ పుంరూపా గోవిందా శివేకవకమూర్తి గోవిందా బ్రహ్మాండరూపా గోవిందా భక్తరక్షక గోవిందా నిత్యకల్యాణ గోవిందా నీరజనాభ గోవిందా హాతీరామప్రియ గోవిందా హరిసర్వోత్తమ గోవిందా జనార్దనమూర్తి గోవిందా జగత్సాక్షిరూప గోవిందా అభిషేకప్రియ గోవిందా అపన్నివారణా గోవిందా రత్నకిరిటా గోవిందా రామానుజనుత గోవిందా స్వయంప్రకాశ గోవిందా ఆశ్రీతపక్ష గోవిందా నిత్యసుభప్రధ గోవిందా నిఖిలలోేకశా గోవిందా ఆనందరూపా గోవిందా ఆద్యంతరహితా గోవిందా ఇహపరదాయక గోవిందా ఇభరాజరక్షఖ గోవిందా పరమదయాళో గోవిందా పద్మనాభహరి గోవిందా తిరుమలవాసా గోవిందా తులసీవనమాల గోవిందా శేషాద్రినిలయ గోవిందా శ్రీనివాస శ్రీ గోవిందా శ్రీ వేంకటేశా గోవిందా గోవిందా హరి గోవిందా గోకులనందన గోవిందా
Copyright © 2007 ttdnews.com , All rights reserved.
This site is owned and managed by Editor, Kaliyuga Narada Monthly , Tirumala - Tirupati.