మనిషి తత్వం ఎప్పుడూ ఒకటే. అలవాట్ల కారణంగానే అతడు ఇతరులకు దూరం అవుతాడు.
- కన్ఫ్యూషియస్
శ్రీవారి ఆస్తి రూ. 33 వేల కోట్లు
తిరుమల , జులై 30 :
తిరుమల శ్రీవారి స్థిర , చరాస్తుల విలువ రూ. 33, 447.74 కోట్లుగా తేల్చారు. మన రాష్ట్రంలోని ఆస్తులను రూ. 33 , 149,16 కోట్లుగానూ , పొరుగు రాష్ట్రాల్లోని ఆస్తుల విలువ రూ. 298.58 కోట్లుగా గుర్తించారు. శ్రీవారి ఆస్తులు , ఆభరణాలపై విమర్శలు రావడంతో టిటిడి శాస్త్రీయ పద్ధతిలో కచ్చితమైన లెక్కలు వేయించింది. తిరుమల శ్రీవారి ఆలయం , టిటిడి నిర్మించిన భవనాలతోపాటు భక్తులు సమర్పించిన భూములు , భవనాలు , ఆలయాలు , ఇతర ఆస్తులు వివరాలను సేకరించింది. గతంలో ఎస్ట్టేట్‌ ఆఫీసర్‌గా పనిచేసిన , రామచంద్రారెడ్డి , టిటిడి , పంచాయతీ , ప్రాపర్టీసెల్‌ యంత్రాంగంతో కలిసి అన్ని ప్రాంతాల్లో తిరిగి ఆస్తుల వివరాలు సేకరించారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం వాటి విలువను మదింపు చేసిన టిటిడి ఆ వివరాలను గత ఏడాది హైకోర్టుకు సమర్పించింది. తాజాగా శ్రీవారి ఆభరణాలు ,వాటి విలువతో సిద్ధం చేసి జాబితాను కోర్టుకు సమర్పించనుంది. టిటిడి కోర్టుకు సమర్పించిన ఆస్తుల కచ్చితమైన జాబితాను సేకరించి ఆ వివరాలు భక్తులకోనం ఇస్తున్నాం.

మన రాష్ట్రంలో శ్రీవారి ఆస్తులు

ప్రాంతం ఎకరాలు విలువ రూ. కోట్లలో

ఆదిలాబాద్‌ 10.33 11.27
అనంతపూర్‌ 36.45 18.37
చిత్తూరు 3,079.68 32,431.76
తూర్పుగోదావరి 35.16 52.94
గుంటూరు 23.12 35.36
హైదరాబాద్‌ 189.2 108.2
కడప 140.32 35.6
కరీంనగర్‌ 14.1 24.81
ఖమ్మం 18.36 40.36
కృష్ణా 85.1 104.69
కర్నూలు 26.6 14.05
మహబూబ్‌నగర్‌ 64.54 45.58
మెదక్‌ 22.33 20.02
నల్లగొండ 15.62 26.24
నెల్లూరు 21.35 10.16
నిజామాబాద్‌ 14.16 26.92
ప్రకాశం 115.72 14.18
రంగారెడ్డి 17.72 8.50
శ్రీకాకుళం 8.08 8.90
విజయనగరం 9.01 13
విశాఖపట్నం 11.54 43.24
వరంగల్‌ 9.84 18.96
పశ్చిమగోదావరి 31.72 36.05
మొత్తం 3,999.77 33,149.16


ఇతర ప్రాంతాల్లో

ప్రాంతం ఎకరాలు విలువరూ.కోట్లలో
కర్ణాటక 14.74 21.37
కేరళ 1.44 8.23
న్యూఢిల్లీ 22.47 29.62
ఒరిస్సా 2.08 38.74
పాండిచ్చేరి 0.29 0.41
తమిళనాడు 80.35 124.1
ఉత్తరాఖాండ్‌ 19.83 75.32
నేపాల్‌ 2.7 0.76
మొత్తం 143.9 298.58

శ్రీవారి మొత్తం ఆస్తుల వివరాలు

ప్రాంతం ఎకరాలు విలువ రూ. కోట్లలో

ఆంధ్రప్రదేశ్‌ 3,999.77 33,149.16
ఇతర ప్రాంతాలు 143.9 298.58
మొత్తం 4,143.67 33,447.74
Tags: ముఖ్యమైన వార్తలు,
ఇతర వార్తలు
శ్రీ శ్రీనివాసా గోవిందా శ్రీ వేంకటేశా గోవిందా భక్తవత్సలా గోవిందా భాగవతప్రియ గోవిందా నిత్యనిర్మలా గోవిందా నీలమేఘశ్యామ గోవిందా పురాణపురుష గోవిందా పుండరీకాక్ష గోవిందా నందనందనా గోవిందా నవనీతచోర గోవిందా పశుపాలకశ్రీ గోవిందా పాపవిమోచన గోవిందా దుష్టసంహార గోవిందా దురితనివారణ గోవిందా శిష్టపరిపాలక గోవిందా కష్టనివారణ గోవిందా వజ్రమకుటధర గోవిందా వరామమూర్తివి గోవిందా గోపీజనలోల గోవిందా గోవర్ధనోద్దార గోవిందా దశరథనందన గోవిందా దశముఖమర్దన గోవిందా పక్షివాహన గోవిందా పాండవప్రియ గోవిందా మత్స్యకూర్మా గోవిందా మధుసూదనహరి గోవిందా వరాహ నరసింహ గోవిందా వామన భృగురామ గోవిందా బలరామానుజ గోవిందా బౌద్ధకల్కిధర గోవిందా వేణుగానప్రియ గోవిందా వేంకటరమణా గోవిందా సీతానాయక గోవిందా శ్రీతపరిపాలక గోవిందా దరిద్రజనపోషక గోవిందా దర్మసంస్ధాపక గోవిందా అనాథరక్షక గోవిందా ఆపద్భాంధక గోవిందా శరణాగతవత్సల గోవిందా కరుణాసాగర గోవిందా కమలదళాక్ష గోవిందా కామితఫలతాదా గోవిందా పాపవినాశక గోవిందా పాహిమురారే గోవిందా శ్రీముద్రాంకిత గోవిందా శ్రీవత్సాంకిత గోవిందా ధరణీనాయక గోవిందా దినకరతేజా గోవిందా పద్మావతీప్రియ గోవిందా ప్రసన్నమూర్తీ గోవిందా అభయహస్తప్రదర్శన గోవిందా మర్త్యావతారా గోవిందా శంఖచక్రధర గోవిందా శార్జగదాదర గోవిందా విరజాతీరస్ధ గోవిందా విరోధిమర్ధన గోవిందా సాలగ్రామధర గోవిందా సహస్రనామా గోవిందా లక్ష్మీవల్లభ గోవిందా లక్ష్మణాగ్రజ గోవిందా కస్తూరితిలక గోవింద కాంచనాంబరధర గోవిందా గరుడవాహన గోవిందా వానరసేవిత గోవిందా వారధిబంధన గోవిందా ఏడుకొండలవాడ గోవిందా ఏకస్వరూపా గోవిందా శ్రీరామకృష్ణ గోవిందా రఘకులనందన గోవిందా ప్రత్యక్షదేవా గోవిందా పరమదయాకర గోవిందా వజ్రకవచధర గోవిందా వ్తెజయంతిమాల గోవిందా వడ్డికాసులవాడ గోవిందా వసుదేవతనయా గోవిందా బిల్వపత్రార్చిత గోవిందా భిక్షుక సంస్తుత గోవిందా స్త్రీ పుంరూపా గోవిందా శివేకవకమూర్తి గోవిందా బ్రహ్మాండరూపా గోవిందా భక్తరక్షక గోవిందా నిత్యకల్యాణ గోవిందా నీరజనాభ గోవిందా హాతీరామప్రియ గోవిందా హరిసర్వోత్తమ గోవిందా జనార్దనమూర్తి గోవిందా జగత్సాక్షిరూప గోవిందా అభిషేకప్రియ గోవిందా అపన్నివారణా గోవిందా రత్నకిరిటా గోవిందా రామానుజనుత గోవిందా స్వయంప్రకాశ గోవిందా ఆశ్రీతపక్ష గోవిందా నిత్యసుభప్రధ గోవిందా నిఖిలలోేకశా గోవిందా ఆనందరూపా గోవిందా ఆద్యంతరహితా గోవిందా ఇహపరదాయక గోవిందా ఇభరాజరక్షఖ గోవిందా పరమదయాళో గోవిందా పద్మనాభహరి గోవిందా తిరుమలవాసా గోవిందా తులసీవనమాల గోవిందా శేషాద్రినిలయ గోవిందా శ్రీనివాస శ్రీ గోవిందా శ్రీ వేంకటేశా గోవిందా గోవిందా హరి గోవిందా గోకులనందన గోవిందా
Copyright © 2007 ttdnews.com , All rights reserved.
This site is owned and managed by Editor, Kaliyuga Narada Monthly , Tirumala - Tirupati.