|
|
|
|
వచ్చేనెల 5 నుంచి 18 వరకు తితిదే అన్నమాచార్య ప్రాజెక్టు ఆధ్వర్యంలో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన గోవింద కల్యాణాలు నాలుగో విడత ఖమ్మం జిల్లాలోని ఏజెన్సీ ప్రాంతాల్లో జరుగుతుందని ఆ ప్రాజెక్టు సంచాలకులు మేడసాని మోహన్ తెలిపారు. ఇందులో భాగంగా 5 న దమ్మపేట , 6 న పెనుపల్లి , 7 న యెనుకూరు , 8 న టేకులపల్లె , 9 న భూర్గంపహడ్ , 11 న వెంకటాపురం , 12 చెర్ల , 13 న దమ్ముగూడం , 14 న కోనవరం , 16 న వర రామచంద్రాపురం , 18 న ఇల్లెందు గ్రామాల్లో గోవింద కల్యాణాలు జరుగుతాయన్నారు. తితిదే వైద్య విభాగం ఆ«ధ్వర్యంలో ఉచిత వైద్యశిబిరాలు నిర్వహించనున్నట్లు ఆయన పేర్కొన్నారు.
|
|
| తితిదే ఉద్యోగుల ఆత్మగౌరవాన్ని దెబ్బతీస్తున్నారు |
|
|
|
తితిదే యజమాన్యం డిప్యుటేషన్‌పై ప్రభుత్వ అధికారులను తీసుకోవడం ద్వారా సమర్థవంతంగా పనిచేస్తున్న తితిదే ఉద్యోగుల ఆత్మగౌరవాన్ని దెబ్బతీస్తున్నారని ప్రరాపా నాయకుడు వూకా విజయ్‌కుమార్ ఆవేదన వ్యక్తం చేశారు. గురువారం ప్రెస్‌క్లబ్‌లో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. తితితే ఇటీవల ప్రకటించిన ఉద్యోగుల భర్తీలో చిత్తూరు జిల్లా వాసులకు 85 శాతం కేటాయించాలని డిమాండు చేశారు.
|
|
| టిటిడి టెంపుల్ ఇన్‌స్పెక్టర్ గోపాల్ మృతి |
|
|
|
శ్రీనివాస మంగాపురంలోని ఆలయ ఇన్‌స్పెక్టర్ కె. గోపాల్ గురువారం మధ్యాహ్నం 1 గంటలకు గుండెనొప్పితో మృతి చెందాడు. ఉదయం తిరుపతి టిటిడి పరిపాలన మందిరంలో తమపని ముగించుకుని 1 గంటకు ఆలయంలో విధుల నిర్వహణకు వెళ్ళేందుకు సన్నద్ధం అవుతుండగా ఉన్నట్లుండి గుండెనొప్పి వచ్చి ఆసుపత్రికి తీసుకెళుతుండగా మార్గమధ్యంలో మృతి చెందారు. ఈయన మృతి పట్ల టిటిడి చైర్మన్ ఈవో , టిటిడి ఉద్యోగులు సంతాపం వ్యక్తం చేశారు.
|
|
| శ్రీవారి సేవలో శాసనసభ బీసీ కమిటీ |
|
|
|
తిరుమల శ్రీ వెంకటేశ్వరస్వామిని అసెంబ్లీ బీసీ సంక్షేమ కమిటీ సభ్యులు గురువారం రాత్రి దర్శించుకున్నారు. అలాగే శ్రీలంక మంత్రి గామిని విజిత్ విజయామని జ్యోస్ కుటుంబ సమేతంగా రాత్రి విరామ సమయంలో స్వామివారి సేవలో పాల్గొన్నారు.
|
|