ఈ రెండేళ్ళలో తితిదేకు ,అటవీశాఖకు మధ్య చర్చలు నడిచాయి. మ«ధ్యమార్గంగా అలైన్‌మెంట్లను మార్పులు చేస్తే పర్యావరణానికి తక్కువ నష్టం జరుగుతుందని అటవీశాఖ సూచించింది. దాని ప్రకారం రోడ్డ్డు వెడల్పు బాగా కుదించేశారు. కేవవలం 10 మీ. వెడల్పుతోనే రోడ్డు నిర్మాణాన్ని చేపట్టాలని నిర్ణయించారు. కుమారధార నుంచి తిరుమల వరకు 7.5 కి.మీ దూరం పైపులైన్ వేయనున్నారు. రూ. 13 కోట్ల వ్యయంతో మెగా కన్రస్టక్షన్ సంస్థ ఈ పనులను చేపట్టింది. కుమారధార నుంచి పాపవినాశనం వరకు మొదటిదశలో పంపింగ్ చేస్తారు. అక్కడినుంచి ప్రస్తుతం ఉన్న పైపులైన్లకు సమాంతరంగా తిరుమల దాకా కొత్తపైపులైన్లను వేస్తారు. ఈమధ్యలో 30 లక్షల లీటర్ల సామర్థ్యంలో కసువు చెరువువద్ద రిజర్వాయర్‌ను నిర్మిస్తారు. పరిమితులకు లోపలే ః సీసీఎప్ మల్లికార్జునరావు తితిదే గతంలో ప్రతాపాదించిన రోడ్డుల్లో ఎస్వీ అభయారణ్యంలో జీవనవైవిధ్యానికి ముప్పు ఏర్పడుతుంది. కొన్ని పరిమితులకు లోబడే అనుమతులిచ్చాం. అలైన్‌మెంటు మార్పించాం. ప్రస్తుత అలైన్‌మెంటుతో పర్యావరణానికి కలిగే నష్టం తగ్గడంతో బాటు తితిదేకు కూడా ఆర్థిక భారం తగ్గుతుంది.
|