జిల్లాలోని జానపద వృత్తి కళాకారులు గురువారం తిరుమలకు మహా పాదయాత్ర చేపట్టారు. తమ డిమాండ్లపై శ్రీవారి హుండీలో వినతిపత్రాన్ని సమర్పించాలన్న ఉద్దేశ్యంతో వీరు కోలాటం, చెక్కభజ నలతో ఉదయం 300 మంది అలిపిరి వద్దకు చేరుకున్నారు. ఇక్కడ వీరిని పోలీసులు అడ్డుకున్నారు. దీంతో కళాకారులు అలిపిరి రోడ్డుపై నే బైఠాయించారు. ఈ సందర్భంగా కళాకారుల సంఘం జిల్లా నేత యాదగిరి మాట్లాడుతూ.. మార్చి పదో తేదీన అన్నమయ్య జయంతి సందర్భంగా టీటీడీ చైర్మన్ ఆదికేశ వులు నాయుడు, ఈవో కృష్ణారావు ను కలసి తాము ఏడు సమస్యలపై వినతిపత్రాలిచ్చామని గుర్తుచేశారు. వీటిలో ఒకటీ ఇంతవరకు అమలు కాలేదని ఆవేదన వ్యక్తంచేశారు. 66 మండలాల్లోని కళాకారులకు 24 గంటలు, ఆరు బృందాలకు భజన చేసే అవకాశం కల్పించాలని కోరారు. నిరుపయోగంగా ఉన్న టీటీడీ కల్యాణ మండపాలను కళాకారుల శిక్షణకు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. ధార్మిక సలహా మండలి, జిల్లా, మండల కమిటీల్లో కళాకారులకు అవకాశం కల్పించాలన్నారు. భజన మండలి బృందాలకు ప్రతి గ్రామానికి మైకు, వాయిద్య పరికరాలు, యూనిఫామ్ ఇవ్వాలని కోరారు. దేవాలయంలో జరిగే ఉత్సవాల్లో మండల పరిధిలోని కళాకారులకు అవకాశం కల్పించాలన్నారు. దీనికిగాను వారికి చార్జీలు, భోజన వసతి ఏర్పాటు చేయాలన్నారు. కళాకారుల గురువులకు ఏడాదికి ఒకసారి గౌరవ సన్మానం, గౌరవ వేతనం ఇవ్వాలని, కళాకారుల సాంస్కృతిక కార్యక్రమాలు జరుగుతునప్పడు డీపీపీలో ప్రత్యేక కమిటీలు ఏర్పాటు చేయాలని ఆయనడ డిమాండు చేశారు. ఈ కార్యక్రమంలో చిన్నబ్బ, వడివేలు, రెడ్డెమ్మ, రమణమ్మ, శ్రీనివాస్‌రెడ్డితోపాటు జిల్లాలోని కళాకారులు పాల్గొన్నారు.
|