అలిపిరి పాదాల మండపం వద్ద జెండాలు, బ్యానర్లతో వచ్చిన పాదయాత్రను టీటీడీ విజిలెన్స్ అధికారులు అడ్డుకున్నారు. బ్యానర్లు తొలగిస్తేనే అనుమతిస్తామని హుకుం జారీచేశారు. తిరుమల పవిత్రతను కాపాడటం కోసం వందల కిలోమీటర్లు పాదయాత్ర చేసి వచ్చిన వారిని ఇలా అడ్డుకోవడంపై అఖిలపక్షం, శ్రీగురుదత్త పీఠం భక్తులు విజిలెన్స్ అధికారులతో వాగ్వివాదానికి దిగారు. ఓదశలో ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. చివరకు బ్యానర్లు, జెండాలు లేకుండానే యాత్ర జరిగింది. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు నరసింహయాదవ్, నీలంబాలాజీ, తిరుమల తిరుపతి సంరక్షణ సమితి అధ్యక్షుడు నరేంద్ర, మంగాడి గోపాల్‌రెడ్డి, ఇనుకొండ సుబ్రమణ్యం, సైకం జయచంద్రారెడ్డి, శ్రీదేవి, శ్రీగురుదత్త పీఠం భక్తులు పాల్గొన్నారు.
|