మనిషి తత్వం ఎప్పుడూ ఒకటే. అలవాట్ల కారణంగానే అతడు ఇతరులకు దూరం అవుతాడు.
- కన్ఫ్యూషియస్
ఇదీ రాయలిచ్చిన ఆభరణాల చరిత్ర!
ఏడు సార్లు శ్రీవారి సందర్శన
హైదరాబాద్ , జులై 30 :
శ్రీకృష్ణదేవరాయలు తన ఇష్టదైవమైన తిరుపతి వెంకటేశ్వరస్వామికి సమర్పించిన ఆభరణాల్లో చాలా వరకు గల్లంతైనట్లు వార్తలొచ్చాయి. ఇందులో కొన్ని ఆభరణాలను కరిగిపెట్టి ఉండొచ్చని.. మరికొన్ని ఇతర నగలతో కలిసి పోయి ఉండొచ్చని టీటీడీ అధికారులు నివేదించిన విషయం తెలిసిందే.

ఈ నేపథ్యంలో శ్రీకృష్ణదేవరాయలు శ్రీవారికి సమర్పించిన ఆభరణాల వివరాలు లభ్యమయ్యాయి. శ్రీకృష్ణదేవరాయలు మొత్తం ఏడు సార్లు తిరుమల దర్శించుకున్నట్లు ఈ నివేదిక ద్వారా తెలుస్తోంది. ఈ వివరాలిలా ఉన్నాయి.

తొలి సందర్శన: శ్రీకృష్ణదేవరాయలు తొలిసారి క్రీ.శ.1513 ఫిబ్రవరి 10న తిరుమలదేవీ, చిన్నాజీదేవీలతో కలిసి శ్రీవారిని దర్శించుకున్నారు. ఆ సమయంలో ఆయన రత్నకిరీటం, నగలు, ఇతర విలువైన రాళ్లను శ్రీవారికి సమర్పించారు. రాణులు బంగారు కప్పులు, ప్లేటు బహూకరించారు.

1513 మే 2: రాయలు ఈ పర్యటన సమయంలో ఎంతో ఉదారంగా కత్తులు, విలువైన రాళ్లతో పొదిగిన ఇతర ఆభరణాలు, వజ్రాలు, ముత్యాలతో కూడిన మూడు కిరీటాలు, కెంపులను ఉత్సవర్లకు సమర్పించారు.

1513 జూన్ 13: తొమ్మిది రకాల విలువైన రాళ్లతో కూడిన తొమ్మిది సెట్ల బంగారు ఆభరణాలను శ్రీవారికి సమర్పించారు. వివిధ కార్యక్రమాల నిర్వహణ కోసం గొడగరనాడు ఉప జిల్లాలోని మూడు గ్రామాలైన చత్రవాది, తూరూరు, కరి కంబుడులను సమర్పించారు.

1514 జూలై 6: రాణులతో కలిసి ఒడిషా పర్యటన నుంచి వెనక్కి వెళుతూ శ్రీవారిని శ్రీకృష్ణదేవరాయలు దర్శించుకున్నారు. అప్పుడాయన శ్రీవారి సన్నిధిలో 30 బంగారు వరహాలతో కనకాభిషేకం నిర్వహించారు. విలువైన రాళ్లు పొదిగిన బంగారు ఆభరణాలను కూడా సమర్పించారు. తలపాకం గ్రామాన్ని శ్రీవారికి అప్పగించారు. తొమ్మిది రకాల వజ్రాలు పొదిగిన నవరత్న ప్రభావళి సెట్‌ను కూడా శ్రీవారికి బహూకరించారు.

1517 జనవరి 2: భగవంతుని ప్రవే శ ద్వారం వద్ద కృష్ణదేవరాయ, తిరుమలదేవి, చిన్నాదేవిల రాగి విగ్రహాలను ప్రతిష్టించారు. 30 వే ల వరహాలను అభయారణ్యం వద్ద ఏ ర్పాట్లకే కేటాయించా రు. తిరుపతిలో నిర్వహించిన వివిధ కార్యక్రమాలకు 500 వరహాలు ఇచ్చారు.

1518 అక్టోబర్ 16: పెద్ద రాణి తిరుమలదేవితో ఈ దఫా రాయలవారు శ్రీవారిని దర్శించుకున్నారు. అప్పుడే పుట్టిన తమ బిడ్డకు స్వామివారి ఆశీస్సులు పొందేందుకు ఆయన తిరుమల వచ్చారు. ఆ బిడ్డకు 'తిరుమల' అనే నామకరణం చేశారు. అయితే ఈ పర్యటనకు సంబంధించి ఎలాంటి లిఖితపూర్వక ఆధారాలు లేవు.

1521 ఫిబ్రవరి 17: శ్రీకృష్ణదేవరాయులు తిరుమలలో జరిపిన తుది పర్యటన ఇది. ఈ పర్యటనలో ఆయన తొమ్మిది రకాల విలువైన రాళ్లతో పొదిగిన పీతాంబరం సెట్‌ను శ్రీవారికి బహూకరించారు. దీంతోపాటు ముత్యాలతో పొదిగిన టోపీ, కెంపులు, 1000 వరహాలు సమర్పించారు. రాణి తిరుమలదేవి నవరత్న హారాన్ని బహూకరించారు.

ఇవేగాక శ్రీకృష్ణదేవరాయలు స్వామివారికి బంగారు కిరీటంతో పాటు తొమ్మిది రకాల విలువైన రాళ్లను స్వామివారికి ఇచ్చారు. పలు రకాల విలువైన ఆభరణాలు, వజ్రాలు పొదిగిన వస్తువులనూ సమర్పించారు.

అంతే కాకుండా ఎంతో బరువైన బంగారు ఆభరణాలు, 2822 శుద్ధి చేసిన కెంపులు, 160 వైడూర్యాలు, 423 పాత వజ్రాలూ ఉన్నాయి. శ్రీకృష్ణదేవరాయలు శ్రీవారికి సమర్పించిన వాటిలో పలు కిరీటాలు, నెక్లెస్‌లు, మాణిక్యాలు కూడా ఉన్నాయి.

ఇతర వార్తలు
శ్రీ శ్రీనివాసా గోవిందా శ్రీ వేంకటేశా గోవిందా భక్తవత్సలా గోవిందా భాగవతప్రియ గోవిందా నిత్యనిర్మలా గోవిందా నీలమేఘశ్యామ గోవిందా పురాణపురుష గోవిందా పుండరీకాక్ష గోవిందా నందనందనా గోవిందా నవనీతచోర గోవిందా పశుపాలకశ్రీ గోవిందా పాపవిమోచన గోవిందా దుష్టసంహార గోవిందా దురితనివారణ గోవిందా శిష్టపరిపాలక గోవిందా కష్టనివారణ గోవిందా వజ్రమకుటధర గోవిందా వరామమూర్తివి గోవిందా గోపీజనలోల గోవిందా గోవర్ధనోద్దార గోవిందా దశరథనందన గోవిందా దశముఖమర్దన గోవిందా పక్షివాహన గోవిందా పాండవప్రియ గోవిందా మత్స్యకూర్మా గోవిందా మధుసూదనహరి గోవిందా వరాహ నరసింహ గోవిందా వామన భృగురామ గోవిందా బలరామానుజ గోవిందా బౌద్ధకల్కిధర గోవిందా వేణుగానప్రియ గోవిందా వేంకటరమణా గోవిందా సీతానాయక గోవిందా శ్రీతపరిపాలక గోవిందా దరిద్రజనపోషక గోవిందా దర్మసంస్ధాపక గోవిందా అనాథరక్షక గోవిందా ఆపద్భాంధక గోవిందా శరణాగతవత్సల గోవిందా కరుణాసాగర గోవిందా కమలదళాక్ష గోవిందా కామితఫలతాదా గోవిందా పాపవినాశక గోవిందా పాహిమురారే గోవిందా శ్రీముద్రాంకిత గోవిందా శ్రీవత్సాంకిత గోవిందా ధరణీనాయక గోవిందా దినకరతేజా గోవిందా పద్మావతీప్రియ గోవిందా ప్రసన్నమూర్తీ గోవిందా అభయహస్తప్రదర్శన గోవిందా మర్త్యావతారా గోవిందా శంఖచక్రధర గోవిందా శార్జగదాదర గోవిందా విరజాతీరస్ధ గోవిందా విరోధిమర్ధన గోవిందా సాలగ్రామధర గోవిందా సహస్రనామా గోవిందా లక్ష్మీవల్లభ గోవిందా లక్ష్మణాగ్రజ గోవిందా కస్తూరితిలక గోవింద కాంచనాంబరధర గోవిందా గరుడవాహన గోవిందా వానరసేవిత గోవిందా వారధిబంధన గోవిందా ఏడుకొండలవాడ గోవిందా ఏకస్వరూపా గోవిందా శ్రీరామకృష్ణ గోవిందా రఘకులనందన గోవిందా ప్రత్యక్షదేవా గోవిందా పరమదయాకర గోవిందా వజ్రకవచధర గోవిందా వ్తెజయంతిమాల గోవిందా వడ్డికాసులవాడ గోవిందా వసుదేవతనయా గోవిందా బిల్వపత్రార్చిత గోవిందా భిక్షుక సంస్తుత గోవిందా స్త్రీ పుంరూపా గోవిందా శివేకవకమూర్తి గోవిందా బ్రహ్మాండరూపా గోవిందా భక్తరక్షక గోవిందా నిత్యకల్యాణ గోవిందా నీరజనాభ గోవిందా హాతీరామప్రియ గోవిందా హరిసర్వోత్తమ గోవిందా జనార్దనమూర్తి గోవిందా జగత్సాక్షిరూప గోవిందా అభిషేకప్రియ గోవిందా అపన్నివారణా గోవిందా రత్నకిరిటా గోవిందా రామానుజనుత గోవిందా స్వయంప్రకాశ గోవిందా ఆశ్రీతపక్ష గోవిందా నిత్యసుభప్రధ గోవిందా నిఖిలలోేకశా గోవిందా ఆనందరూపా గోవిందా ఆద్యంతరహితా గోవిందా ఇహపరదాయక గోవిందా ఇభరాజరక్షఖ గోవిందా పరమదయాళో గోవిందా పద్మనాభహరి గోవిందా తిరుమలవాసా గోవిందా తులసీవనమాల గోవిందా శేషాద్రినిలయ గోవిందా శ్రీనివాస శ్రీ గోవిందా శ్రీ వేంకటేశా గోవిందా గోవిందా హరి గోవిందా గోకులనందన గోవిందా
Copyright © 2007 ttdnews.com , All rights reserved.
This site is owned and managed by Editor, Kaliyuga Narada Monthly , Tirumala - Tirupati.