టిటిడి సౌజన్యంతో శ్రీ వేంకట అన్నమాచార్య సేవా ట్రస్టు ఆధ్వర్యంలో తాళ్లపాక అన్నమాచార్య 602 వ జయంత్యుత్సవాలను శుక్రవారం నుంచి నిర్వహిస్తున్నట్లు ఆ ట్రస్టు కార్యదర్శి తాళ్లపాక గౌరీప్రసూన బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. శుక్రవారం సాయంత్రం అన్నమయ్య వంశీయులు , ఎ.కె.ఎన్ కళాకారులు ఎ. రాజమోహన్ బృందంచే అన్నమయ్య చిత్రపటంలో నగర సంకీర్తన చేయనున్నట్లు తెలిపారు. తర్వాత అన్నమాచార్య ప్రాజెక్టు కళాకారుల గోష్ఠిగానం , ఎస్వీఎస్ సుధామాధురి బృందంచే నృత్యకార్యక్రమం , రాత్రి 7.00 గంటలకు అన్నమయ్య సంకీర్తనారవళి కార్యక్రమాలు ఉంటాయన్నారు. శనివారం నాదస్వరం ,లావణ్యచే గాత్ర కచేరి , చంద్రన్‌చే అన్నమయ్య మధురవాణి , రాత్రి అన్నమయ్య నాటక నృత్యరూపక కార్యక్రమాలు ఉంటాయని ఆమె పేర్కొన్నారు.
|