మనిషి తత్వం ఎప్పుడూ ఒకటే. అలవాట్ల కారణంగానే అతడు ఇతరులకు దూరం అవుతాడు.
- కన్ఫ్యూషియస్
లోకకల్యాణం కోసం తిరుమలలో చాతుర్మాస దీక్ష
తిరుమల , జులై 26 :
లోక కల్యాణం కోసం తిరుమలలో ఆదివారం చాతుర్మాస వ్రతదీక్ష ప్రారంభమైంది. సంసార బంధం నుంచి విముక్తి పొంది సన్యాసం స్వీకరించి జపతపాలు నిర్వహించడమే ఈ వ్రతం ముఖ్య ఉద్దేశం. ఈ దీక్షచేసేవారు నాలుగు నెలలపాటు మరో ప్రాంతానికి వెళ్ళకుండా కొనసాగించడం విశేషం. తిరుమలలోని పెద్దజీయర్‌ మఠంలో శ్రీ పెరియకెళ్లి అప్పన్‌ రామానుజ ఆధ్వర్యంలో చాతుర్మాసవ్రత దీక్ష నిర్వహించారు. కుర్తాలం సిద్దేశ్వరపీఠంలో జగద్గురు శ్రీ సిద్దేశ్వర ఆనంద భారతీస్వామి , మళయాళస్వామి మఠంలో శ్రీపరిపూర్ణానంద స్వామి నేతృత్వంలో ఈ దీక్ష చేపట్టారు.

ప్రతిఏటా గురుపూర్ణిమ రోజు ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడం ఆనవాయితీగా వస్తోంది. ఇందులో భాగంగా ఆ భూమిపూజ , పుణ్యాహవచనం , మృత్యంగ్రహణం , సంకల్పం నిర్వహించి ఈ వ్రతానికి శ్రీకారం చుట్టారు. ఈ కార్యక్రమానికి టిటిడి చైర్మన్‌ డీకే ఆదికేశవులు ముఖ్య అతిథిగా విచ్చేసి మాట్లాడారు. అలాగే ఆయన కొత్తగా నిర్మాణం చేపట్టిన సిద్దేశ్వర పీఠాన్ని ఆదివారం ప్రారంభించారు. కుర్తాలం పీఠం ఆ«ధ్వర్యంలో చాతుర్మాస వ్రతం నిర్వహించడం విశేషమన్నారు. టిటిడి పాలకమండలి ఇలాంటి ధార్మిక కార్యక్రమాలకు పెద్దపీట వేస్తోందని చెప్పారు. కార్యక్రమంలో టిటిడి ఈవో కృష్ణారావు , సీనియర్‌ పాత్రికేయులు పొత్తూరి వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.

ఇతర వార్తలు
శ్రీ శ్రీనివాసా గోవిందా శ్రీ వేంకటేశా గోవిందా భక్తవత్సలా గోవిందా భాగవతప్రియ గోవిందా నిత్యనిర్మలా గోవిందా నీలమేఘశ్యామ గోవిందా పురాణపురుష గోవిందా పుండరీకాక్ష గోవిందా నందనందనా గోవిందా నవనీతచోర గోవిందా పశుపాలకశ్రీ గోవిందా పాపవిమోచన గోవిందా దుష్టసంహార గోవిందా దురితనివారణ గోవిందా శిష్టపరిపాలక గోవిందా కష్టనివారణ గోవిందా వజ్రమకుటధర గోవిందా వరామమూర్తివి గోవిందా గోపీజనలోల గోవిందా గోవర్ధనోద్దార గోవిందా దశరథనందన గోవిందా దశముఖమర్దన గోవిందా పక్షివాహన గోవిందా పాండవప్రియ గోవిందా మత్స్యకూర్మా గోవిందా మధుసూదనహరి గోవిందా వరాహ నరసింహ గోవిందా వామన భృగురామ గోవిందా బలరామానుజ గోవిందా బౌద్ధకల్కిధర గోవిందా వేణుగానప్రియ గోవిందా వేంకటరమణా గోవిందా సీతానాయక గోవిందా శ్రీతపరిపాలక గోవిందా దరిద్రజనపోషక గోవిందా దర్మసంస్ధాపక గోవిందా అనాథరక్షక గోవిందా ఆపద్భాంధక గోవిందా శరణాగతవత్సల గోవిందా కరుణాసాగర గోవిందా కమలదళాక్ష గోవిందా కామితఫలతాదా గోవిందా పాపవినాశక గోవిందా పాహిమురారే గోవిందా శ్రీముద్రాంకిత గోవిందా శ్రీవత్సాంకిత గోవిందా ధరణీనాయక గోవిందా దినకరతేజా గోవిందా పద్మావతీప్రియ గోవిందా ప్రసన్నమూర్తీ గోవిందా అభయహస్తప్రదర్శన గోవిందా మర్త్యావతారా గోవిందా శంఖచక్రధర గోవిందా శార్జగదాదర గోవిందా విరజాతీరస్ధ గోవిందా విరోధిమర్ధన గోవిందా సాలగ్రామధర గోవిందా సహస్రనామా గోవిందా లక్ష్మీవల్లభ గోవిందా లక్ష్మణాగ్రజ గోవిందా కస్తూరితిలక గోవింద కాంచనాంబరధర గోవిందా గరుడవాహన గోవిందా వానరసేవిత గోవిందా వారధిబంధన గోవిందా ఏడుకొండలవాడ గోవిందా ఏకస్వరూపా గోవిందా శ్రీరామకృష్ణ గోవిందా రఘకులనందన గోవిందా ప్రత్యక్షదేవా గోవిందా పరమదయాకర గోవిందా వజ్రకవచధర గోవిందా వ్తెజయంతిమాల గోవిందా వడ్డికాసులవాడ గోవిందా వసుదేవతనయా గోవిందా బిల్వపత్రార్చిత గోవిందా భిక్షుక సంస్తుత గోవిందా స్త్రీ పుంరూపా గోవిందా శివేకవకమూర్తి గోవిందా బ్రహ్మాండరూపా గోవిందా భక్తరక్షక గోవిందా నిత్యకల్యాణ గోవిందా నీరజనాభ గోవిందా హాతీరామప్రియ గోవిందా హరిసర్వోత్తమ గోవిందా జనార్దనమూర్తి గోవిందా జగత్సాక్షిరూప గోవిందా అభిషేకప్రియ గోవిందా అపన్నివారణా గోవిందా రత్నకిరిటా గోవిందా రామానుజనుత గోవిందా స్వయంప్రకాశ గోవిందా ఆశ్రీతపక్ష గోవిందా నిత్యసుభప్రధ గోవిందా నిఖిలలోేకశా గోవిందా ఆనందరూపా గోవిందా ఆద్యంతరహితా గోవిందా ఇహపరదాయక గోవిందా ఇభరాజరక్షఖ గోవిందా పరమదయాళో గోవిందా పద్మనాభహరి గోవిందా తిరుమలవాసా గోవిందా తులసీవనమాల గోవిందా శేషాద్రినిలయ గోవిందా శ్రీనివాస శ్రీ గోవిందా శ్రీ వేంకటేశా గోవిందా గోవిందా హరి గోవిందా గోకులనందన గోవిందా
Copyright © 2007 ttdnews.com , All rights reserved.
This site is owned and managed by Editor, Kaliyuga Narada Monthly , Tirumala - Tirupati.