మనిషి తత్వం ఎప్పుడూ ఒకటే. అలవాట్ల కారణంగానే అతడు ఇతరులకు దూరం అవుతాడు.
- కన్ఫ్యూషియస్
మీ ప్రశ్నలకు- సమాధానాలు
వికలాంగులు, వయో వృద్ధులు, చిన్న పిల్లల తల్లులకు, వ్యాధిగ్రస్తులకు శ్రీవారిని దర్శించుకునేందుకు ప్రత్యేక ఏర్పాట్లు వున్నాయా?
వికలాంగులు, వయో వృద్ధులు, చిన్న పిల్లల తల్లులు శ్రీవారిని దర్శనం చేసుకోవటానికి ఏదైనా ప్రత్యేక ఏర్పాట్లు వున్నాయా? గుండె జబ్బులు వంటి ప్రాణాపాయ జబ్బులు వున్న వారికి కూడా ప్రత్యేక దర్శన ఏర్పాట్లు వున్నాయి? వుంటే ఆ వివరాలు తెలపండి. అందుకు మేము ఏదైనా ఛార్జీలు చెల్లించాలా? ఈ వివరాలను తెలిపగలరు.
రాధాకృష్ణ
బెంగళూరు
వయోవృద్ధులకు, వికలాంగులకు ప్రత్యేక దర్శన ఏర్పాట్లను పలు సంవత్సరాలుగా టిటిడి చేస్తోంది.
ఇటీవల కాలంలో చంటి బిడ్డల తల్లులకు సయితం మహద్వారం గుండా దర్శనానికి అనుమతినిస్తున్నారు.
వయోవృద్ధులు,
వికలాంగులు
ప్రాణాపాయ వ్యాధులున్న వారు
చంటిపిల్లల తల్లులు ప్రత్యేక దర్శనానికి వెళ్లాలంటే ఏం చేయాలంటే...
1. ఆలయం ఎదురుగా మీ కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన షెడ్‌లో వేచి వుండాలి.
2. మీరు అక్కడ వేచి వుంటే ప్రతి రెండు గంటలకు ఒకసారి ఆలయం ముందు నుంచే నేరుగా శ్రీవారి దర్శనానికి అనుమతిస్తారు.
ఏఏ సమయంలో వయోవృద్ధులను, వికలాంగులను, చంటిపిల్లల తల్లులను ప్రత్యేకగా మహద్వారం ద్వారా దర్శనానికి అనుమతి ఇచ్చేది అక్కడే ఏర్పాటు చేసిన బోర్డులో
కూడా రాసి వుంటుంది.
3. ఇలా ప్రత్యేకంగా దర్శనానికి వెళ్లే వారితో పాటు, వారి కుటుంబ సభ్యుల్లో ఒకరిని పంపటానికి వీలైతే పంపుతారు. లేదా టిటిడి ఉద్యోగుల్లో ఎవరో ఒకరు గానీ, శ్రీవారిసేవకుల్లో ఎవరో ఒకరు గానీ వికలాంగులకు తోడుగా వెళ్లి దర్శనం తర్వాత తిరిగి తీసుకువచ్చి వదులుతారు.

క్యూలో వేచి వుండాల్సిన పని లేదు...
4. అంటే మహద్వారం ద్వారా ప్రత్యేకంగా దర్శనానికి వెళ్లే వారు సాధారణ భక్తుల్లా క్యూకాంప్లెక్స్‌లో గంటల కొద్ది సమయం వేచి వుండి, పెద్ద క్యూ ద్వారా రావాల్సిన అవసరం వుండదు.
ఆలయం లోపల వెండి వాకిలి వద్ద వున్న ధ్వజస్తంభం నుంచి వున్న క్యూ నుంచి మాత్రం మిగతా భక్తులతో పాటు సుమారు ఓ 15 నిమిషాలు మాత్రం క్యూలో వెళ్లాల్సి వుంటుంది.
5. మహద్వారం ద్వారా దర్శనానికి వెళ్లే వీరికి 5 రూపాయలకు ఇచ్చే లడ్డూ ప్రసాదం టోకన్‌ను ఇస్తారు. 5 రూపాయలు చెల్లించి ఈ టోకన్‌ను పొందవచ్చు.

ప్రాణాపాయం వున్న వారికి కూడా ప్రత్యేక ప్రవేశం...
వికలాంగులు ఏ వయస్సు వారైనా ఆలయంలోకి ప్రత్యేకంగా మహద్వారం ద్వారా అనుమతిస్తున్నట్టే, ప్రాణాపాయ వ్యాధులున్న వారు సయితం ఏ వయస్సు వారైనా, వారిని కూడా టిటిడి మహద్వారం గుండా ప్రత్యేకంగా అనుమతి ఇస్తుంది. అయితే వ్యాధి గ్రస్తులు తప్పకుండా సరైన రుజువులను టిటిడి సిబ్బందికి చూపాల్సి వుంటుంది.

మర్యాద పూర్వకంగా ఏర్పాట్లు...
ప్రత్యేక దర్శనం వద్ద అమర్యాదగా టిటిడి సిబ్బంది ప్రవర్తిస్తున్నారని కలియుగ నారద ద్వారా భక్తులు టిటిడి ఇ.ఓకు రాసిన లేఖకు కూడా ఇ.ఓ రమణాచారి తీవ్రంగా స్పందించారు. ప్రత్యేక దర్శనానికి అనుమతించే వారికి ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా చర్యలు తీసుకోవాలని తిరుమల జె.ఇ.ఓను ఆదేశించారు. వ్యాధిగ్రస్తుల పేరుతో దుర్వినియోగం జరగకుండా, త్వరలో ఆలయం ముందు ప్రత్యేకంగా వైద్య సిబ్బందిని కూడా పెట్టాలని చూస్తున్నారు.
శ్రీవారి సేవలో...
కలియుగ నారద బృందం
Tags: ముఖ్యమైన వార్తలు,
ఇతర ప్రశ్నలు
శ్రీ శ్రీనివాసా గోవిందా శ్రీ వేంకటేశా గోవిందా భక్తవత్సలా గోవిందా భాగవతప్రియ గోవిందా నిత్యనిర్మలా గోవిందా నీలమేఘశ్యామ గోవిందా పురాణపురుష గోవిందా పుండరీకాక్ష గోవిందా నందనందనా గోవిందా నవనీతచోర గోవిందా పశుపాలకశ్రీ గోవిందా పాపవిమోచన గోవిందా దుష్టసంహార గోవిందా దురితనివారణ గోవిందా శిష్టపరిపాలక గోవిందా కష్టనివారణ గోవిందా వజ్రమకుటధర గోవిందా వరామమూర్తివి గోవిందా గోపీజనలోల గోవిందా గోవర్ధనోద్దార గోవిందా దశరథనందన గోవిందా దశముఖమర్దన గోవిందా పక్షివాహన గోవిందా పాండవప్రియ గోవిందా మత్స్యకూర్మా గోవిందా మధుసూదనహరి గోవిందా వరాహ నరసింహ గోవిందా వామన భృగురామ గోవిందా బలరామానుజ గోవిందా బౌద్ధకల్కిధర గోవిందా వేణుగానప్రియ గోవిందా వేంకటరమణా గోవిందా సీతానాయక గోవిందా శ్రీతపరిపాలక గోవిందా దరిద్రజనపోషక గోవిందా దర్మసంస్ధాపక గోవిందా అనాథరక్షక గోవిందా ఆపద్భాంధక గోవిందా శరణాగతవత్సల గోవిందా కరుణాసాగర గోవిందా కమలదళాక్ష గోవిందా కామితఫలతాదా గోవిందా పాపవినాశక గోవిందా పాహిమురారే గోవిందా శ్రీముద్రాంకిత గోవిందా శ్రీవత్సాంకిత గోవిందా ధరణీనాయక గోవిందా దినకరతేజా గోవిందా పద్మావతీప్రియ గోవిందా ప్రసన్నమూర్తీ గోవిందా అభయహస్తప్రదర్శన గోవిందా మర్త్యావతారా గోవిందా శంఖచక్రధర గోవిందా శార్జగదాదర గోవిందా విరజాతీరస్ధ గోవిందా విరోధిమర్ధన గోవిందా సాలగ్రామధర గోవిందా సహస్రనామా గోవిందా లక్ష్మీవల్లభ గోవిందా లక్ష్మణాగ్రజ గోవిందా కస్తూరితిలక గోవింద కాంచనాంబరధర గోవిందా గరుడవాహన గోవిందా వానరసేవిత గోవిందా వారధిబంధన గోవిందా ఏడుకొండలవాడ గోవిందా ఏకస్వరూపా గోవిందా శ్రీరామకృష్ణ గోవిందా రఘకులనందన గోవిందా ప్రత్యక్షదేవా గోవిందా పరమదయాకర గోవిందా వజ్రకవచధర గోవిందా వ్తెజయంతిమాల గోవిందా వడ్డికాసులవాడ గోవిందా వసుదేవతనయా గోవిందా బిల్వపత్రార్చిత గోవిందా భిక్షుక సంస్తుత గోవిందా స్త్రీ పుంరూపా గోవిందా శివేకవకమూర్తి గోవిందా బ్రహ్మాండరూపా గోవిందా భక్తరక్షక గోవిందా నిత్యకల్యాణ గోవిందా నీరజనాభ గోవిందా హాతీరామప్రియ గోవిందా హరిసర్వోత్తమ గోవిందా జనార్దనమూర్తి గోవిందా జగత్సాక్షిరూప గోవిందా అభిషేకప్రియ గోవిందా అపన్నివారణా గోవిందా రత్నకిరిటా గోవిందా రామానుజనుత గోవిందా స్వయంప్రకాశ గోవిందా ఆశ్రీతపక్ష గోవిందా నిత్యసుభప్రధ గోవిందా నిఖిలలోేకశా గోవిందా ఆనందరూపా గోవిందా ఆద్యంతరహితా గోవిందా ఇహపరదాయక గోవిందా ఇభరాజరక్షఖ గోవిందా పరమదయాళో గోవిందా పద్మనాభహరి గోవిందా తిరుమలవాసా గోవిందా తులసీవనమాల గోవిందా శేషాద్రినిలయ గోవిందా శ్రీనివాస శ్రీ గోవిందా శ్రీ వేంకటేశా గోవిందా గోవిందా హరి గోవిందా గోకులనందన గోవిందా
Copyright © 2007 ttdnews.com , All rights reserved.
This site is owned and managed by Editor, Kaliyuga Narada Monthly , Tirumala - Tirupati.