| ఆర్జితసేవను పోస్ట్‌పోన్ చేసుకోవటం సాధ్యమా? |
| నేను ఆగస్టు 18వ తేదీకి వసంతోత్సవంకు అడ్వాన్స్ రిజర్వేషన్‌లో టిక్కెట్టు పొందాను. అనివార్యకారణాల పాల్గొనలేక పోతున్నాను. నాకు సెప్టెంబర్, అక్టోబర్‌లలో ఏ రోజైన ఆ సేవలో పాల్గొనటానికి పోస్ట్‌పోన్‌మెంట్‌కు టీటీడీ అవకాశం కల్పిస్తుందా? |
|
మధుబాబు గారికి,
మీరు వెంటనే మీ వద్ద వున్న ఆర్జితసేవా టిక్కెట్టును జిరాక్సు తీసి పెట్టుకుని, ఒరిజినల్ టిక్కెట్టును ఎ.ఇ.ఓ ఆర్జితం, టీటీడీ, తిరుమలకు రిజిస్టర్‌పోస్టులో పంపండి. దాంతో పాటు పోస్టు పోన్ మెంట్ కారణం ఏమిటో తెలిపుతూ లేఖ రాయాలి. టిక్కెట్టు ధరలో 25 శాతం డి.డి తీసి, లేఖకు జత చేసి పంపండి. మీ తెలిపిన కారణం సబబుగా టీటీడీ అధికారులు భావిస్తే, మీరు కోరిన విధంగా మరో తేదీకి వసంతోత్సవం టిక్కెట్టును కేటాయించి, మీకు పోస్టులో పంపుతారు. ఇప్పటికే సమయం అయిపోతోంది. త్వరగా పంపండి. |
|
|
శ్రీవారి సేవలో... |
| కలియుగ నారద బృందం | |
|